వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు (World Economic Forum) లో పాల్గొంటున్న ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) తొలి రోజు బిజీబిజీగా గడిపారు. పలు అంశాలపై చర్చలు జరిపిన జగన్.., డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.తయారీ రంగంలో అత్యాధునికతకు సంతరించుకోవడానికి వీలుగా, అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. కాలుష్యంలేని ఇంధనాల అంశంపైనా దావోస్ చర్చల్లో సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. పంప్‌డ్డ్ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మెనియాల తయారీపై పలువురితో చర్చింరారు. విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై వీరు ప్రశసంలు కురిపించారు. పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయని వారు కొనియాడారు.
డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్‌తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయిన ప్రొఫెసర్ క్లాజ్ అన్నారు. ధాన్యాగారంగా పేరొందిన ఏపీ ఫుడ్ హబ్‌గా మారేందుకు అన్నిరకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలపై సీఎం వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశాన్ని చర్చించారు. అందుకు అనువైన సదుపాయాలనూ ఏర్పాటుచేస్తున్నామన్నారు. కాలుష్యంలేని పారిశ్రామిక ప్రగతి వైపుగా అడుగులేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.
సోషల్ గవర్నెన్స్, పర్యావరణ పరిరక్షణ అంశాల్లో డబ్ల్యూఈఎఫ్ వేదికద్వారా రాష్ట్రానికి మంచి ప్రయోజనాలు అందాలని సీఎం ఆకాక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్ణయించుకున్న అంశాలను సీఎం డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడికి వివరించారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి విద్య, వైద్యరంగాల్లో పెద్దమొత్తంలో ఖర్చుచేస్తున్నామని ఈ సమావేశంలో సీఎం వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికీ, వారి గడపవద్దకే సేవలను అందిస్తున్నామని వివరించారు.
ఈ సమావేశం తర్వాత సీఎం కాంగ్రెస్ వేదిక నుంచి నేరుగా ఏపీ పెవిలియన్‌కు చేరుకున్నారు. పెవిలియన్‌లో జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఆతర్వాత వివిధ ప్రముఖులతో వరుస సమావేశాలు జరిపారు. డబ్ల్యూఈఎఫ్ మొబిలిటీ, సస్టెయిన్ బిలిటీ విభాగాధిపతి, పెడ్రో గోమెజ్‌తోనూ సీఎం, ఏపీ పెవిలియన్‌లో సమావేశమయ్యారు. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టిన మూవ్‌ఇండియా కార్యక్రమానికి ఏపీని మొదటిసారిగా ఎంపికచేశారు. ఈనేపథ్యంలో వీరి సమావేశానికి కీలక ప్రాధాన్యత ఏర్పడింది. రవాణా రంగంలో వస్తున్న మార్పులపై ఇరువురి మధ్య నిశిత చర్చ జరిగింది.
తర్వాత డబ్ల్యూఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్ తగిన సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రాన్ని అడ్వాన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది.
ఇది చదవండి: అమ్మఒడిపై కీలక అప్ డేట్.. ఈసారి వచ్చేది రూ.13వేలే.! కారణం ఇదే..
తర్వాత సీఎం జగన్.., బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్‌పాల్ బక్నర్‌తో సమావేశమ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలను సీఎం వివరించారు. అనుమతుల్లో జాప్యం లేకుండా సింగిల్ డెస్క్ విధానంద్వారా పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి అనుమతులు ఇస్తున్నామని వివరించారు. మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం జగన్ అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతం అదానీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.