హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: ఏపీ స్కూళ్లలో కొత్త కాన్సెప్ట్.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు..

YS Jagan: ఏపీ స్కూళ్లలో కొత్త కాన్సెప్ట్.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు..

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యాశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై సీఎం జగన్ (AP CM YS Jagan) సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆరు కేటిగిరీల కింద స్కూళ్ల ఏర్పాటు - మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు, ఇంగ్లిషు బోధన, డిజిటల్‌ లెర్నింగ్, మండలానికి రెండు జూనియర్‌ కళాశాలల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విద్యాశాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై సీఎం జగన్ (AP CM YS Jagan) సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆరు కేటిగిరీల కింద స్కూళ్ల ఏర్పాటు - మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు, ఇంగ్లిషు బోధన, డిజిటల్‌ లెర్నింగ్, మండలానికి రెండు జూనియర్‌ కళాశాలల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు తీరును సీఎంకు అధికారులు వివరించారు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిన స్కూళ్లను కూడా మ్యాపింగ్‌ చేశామన్నారు. ప్రతిరోజూ ఒక ఇంగ్లిషు పదాన్ని నేర్పేలా విద్యార్థులకు బోధన ఉండాలన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక సూచనలు చేశారు.

  వీలైంత త్వరగా సబ్జెక్టుల వారీగా టీచర్ల అందుబాటులోకి తీసుకొస్తున్నామని.., టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ వాడుకోకూడదని సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు. దీనివల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్నారు. ప్రతిరోజూ ఒక పదాన్ని నేర్పేటప్పుడు డిక్షనరీలో దాన్ని చూసి అర్థం తెలుసుకోవడంతో పాటు, వాక్యంలో ఎలా ఉపయోగించాలో కూడా నేర్పాలని సీఎం సూచించారు.

  ఇది చదవండి: ఏపీలో వేసవి కరెంటు కోతలు తప్పవా..? విద్యుత్ ఉత్పత్తిపై డేంజర్ బెల్స్..! కారణం ఇదే..


  లెర్నింగ్‌ టు లెర్న్‌ కాన్పెప్ట్‌లోకి తీసుకెళ్లాలన్న సీఎం.., కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లో కూడా ఉపాధ్యాయశిక్షణ కేంద్రాలు ఉండాలన్నారు. ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాలలో నాడు – నేడు కింద సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. స్కూళ్లలో హెడ్‌ మాస్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలన్న రు.

  ఇది చదవండి: ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్.. ఆంధ్రా హోటళ్లలో పూరీ, బజ్జీ బంద్.. కారణం ఇదే..!


  స్కూళ్లలో నాడు – నేడు కింద ఏర్పాటుచేసుకున్న సౌకర్యాల నిర్వహణ బాగుండాలని.., టాయిలెట్లు, తాగునీటి ప్లాంట్ల నిర్వహణ సవ్యంగా ఉండేలా చూడాలన్నారు. స్కూళ్లలో సమస్యపై ఫిర్యాదు వచ్చిన వారంరోజుల్లోగా పరిష్కారం కావాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని టెక్నికల్, ఇంజినీరింగ్‌ సిబ్బంది, విలేజ్‌ క్లినిక్స్‌లో సిబ్బందికి స్కూళ్లలో వసతుల నిర్వహణపై తగిన ఎస్‌ఓపీలను ఇవ్వాలన్నారు.

  ఇది చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. వారికి ఏడాది పాటు సెలవులు.. వివరాలివే..!


  మార్చి 15 నుంచి స్కూళ్లలో నాడు-నేడు రెండోవిడత మొదలుపెట్టాలని.., స్కూళ్లలో ప్లే గ్రౌండ్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి మ్యాపింగ్‌ చేసి... ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక అందించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రైవేటు కాలేజీల్లో కూడా సౌకర్యాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా..? లేదో..? చూడాలన్నారు. తల్లిదండ్రులు కడుతున్న ఫీజులకు అనుగుణంగా పిల్లలకు సౌకర్యాలు, వసతులు అందిస్తున్నారో లేదో క్రమం తప్పకుండా చూడాలన్నారు.

  ఇది చదవండి: పొలిటికల్ పార్టీపై బ్రదర్ అనిల్ దృష్టి..? అదే జరిగితే జగన్ కు లాభమా..? నష్టమా..?


  రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను ఆచరణలోకి తీసుకురావడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రతి పార్లమెంటుకు ఒక స్కిల్‌ కాలేజీతోపాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్‌ సమ్మిళతంగా ఒక స్కిల్‌ సెంటర్‌ తప్పనిసరిగా ఉండాలన్నారు. వీటన్నింటికీ పాఠ్యప్రణాళికను స్కిల్‌ యూనివర్శిటీ రూపొందించాలని, దీన్ని తిరుపతిలో పెడతామని ఇదివరకే నిర్ణయం తీసుకున్నామన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government

  ఉత్తమ కథలు