Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN CONDUCTED REVIEW MEETING ON IRRIGATIONS PROJECTS IN THE STATE FULL DETAILS HERE PRN

CM Jagan: ఆ విషయంలో తగ్గేదేలే.. అధికారులకు సీఎం జగన్ టార్గెట్..

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం జగన్ (CM YS Jagan) అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం జలవనరుల శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం జగన్ (CM YS Jagan) అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం జలవనరుల శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు ప్రాధాన్యతా ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయా ప్రాజెక్టుల్లో పూర్తైన పనులు, పూర్తి చేయాల్సిన పనులపై సమీక్షించారు. ఈ క్రమంలో ప్రాజెక్టుల వారీగా లక్ష్యాలను నిర్దేశించారు. అన్ని పనులు గడువులోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో మరింత స్పష్టతతో పనిచేయాలన్నారు. దిగువ కాఫర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ లకు సంబంధించిన పనులపై సీఎం చర్చించారు. పోలవరం డౌన్‌ స్ట్రీం కాఫర్‌ డ్యాంకు సంబంధించి అన్ని డిజైన్లూ వచ్చాయని, జులై 31 కల్లా పని పూర్తవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాంకు సంబంధించి డిజైన్లు కూడా త్వరలో ఖరారవుతాయని సీఎం అన్నారు.

    ఆర్అండ్ఆర్ ప్యాకేజీపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించగా.. మొదటగా ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న 20,946 కుటుంబాల్లో ఇప్పటికే 7,962 మందిని తరలించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. అలాగే 3,228 మంది ఓటీఎస్‌ కు దరఖాస్తు చేసుకున్నారని, మిగిలిన 9,756 మందిని తరలించాలన్నారు. డీబీటీ పద్ధతుల్లో ఆర్‌ అండ్‌ ఆర్‌ కింద ప్యాకేజీలు చెల్లించాలని జగన్ స్పష్టం చేశారు.

    ఇది చదవండి: “జగన్ సీఎం కాకుంటే రాజకీయాలకు గుడ్ బై.. మేం గాజులు తొడుక్కోలేదు..”మంత్రి సంచలన వ్యాఖ్యలు..


    నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తిచేసి మే 15 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. సంగం బ్యారేజీ పనులు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చాయన్న అధికారులు. మే 15 నాటికి పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామన్నారు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంగం బ్యారేజిగా నోటిఫై చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే అవుకు టన్నెల్‌–2లో మిగిలిపోయిన పనులు కేవలం 77.5 మీటర్లు, ఈసీజన్‌లో పనులను 120 రోజుల్లో పనులు పూర్తిచేసేలా ప్రణాళికలు వేసినట్లు అధికారులు తెలిపారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్‌–2 పనుల వివరాలను సీఎం తెలుసుకున్నారు.

    ఇది చదవండి: టీడీపీ లెక్క 23 నుంచి 123 అవ్వాలంటే ఏం చేయాలి.. ఇప్పుడేం చేస్తోంది..? 


    ఇక వంశధార – నాగావళి పనులు అక్టోబరు నాటికి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వంశధార నదిపై గొట్టా బ్యారేజి వద్ద నీటిని లిఫ్ట్‌ చేసి హిరమండలం రిజర్వాయర్‌లోకి పంపింగ్‌కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిచాలని చెప్పారు. ఉత్తరాంధ్రలోని ప్రధాన ప్రాజెక్టులైన తోటపల్లి బ్యారేజీ, గజపతినగరం బ్రాంచి కెనాల్, తారరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుపైనా సీఎం సమీక్షించారు. ఈప్రాజెక్టుల పనులన్నీ వీలంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తారకరామ తీర్థసాగర్‌లో రిజర్వాయర్‌ పనులు పూర్తికావొచ్చాయని అధికారులు వివరించగా.. మిగిలిన పనులు వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు.

    ఇది చదవండి: ఏపీలోని ఆ పథకంపై ఆసక్తి చూపని జనం.. ఏడాదికి రూ.60వేలు ఇస్తామన్నా నో రెస్పాన్స్..!


    ఆర్ధిక శాఖ అనుమతులు తీసుకొని మహేంద్ర తనయ ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా దృష్టిపెట్టాలన్న సీఎం.., మెయిన్‌ కెనాల్‌ను శ్రీకాకుళం వరకూ తీసుకెళ్లాలని.. దీనికి సంబంధించిన భూ సేకరణ తదితర అంశాలపై ముందుకెళ్లాలన్నారు. ఈ సమావేశానికి మంత్రి అనిల్‌కుమార్‌, సీఎస్ సమీర్‌ శర్మ పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Irrigation Projects

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు