ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పై ఏపీ సీఎం జగన్ (AP CM YS Jagan) కీలక ఆదేశాలిచ్చారు. గోదావరి నది (Godavari River) కి రికార్డుస్థాయిలో వరద రావడంతో అధికారులకు కీలక సూచనలు చేశారు. గురువారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జలవనరుల శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలు.. ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా తలెత్తిన పరిణామాలపై అధికారులతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టులో ఈసీఆర్‌ఎఫ్‌డ్యాం నిర్మాణ ప్రాంతంలో గతంలో ఏర్పడ్డ గ్యాప్-1, గ్యాప్-2లు పూడ్చే పనుల అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. రెండు గ్యాప్‌లను పూడ్చే పనులను నిర్ధారించడానికి 9 రకాల టెస్టులు, నివేదికలు అవసరం అవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. ఇప్పటికే కొన్ని పూర్తికాగా.. మిగిలిన టెస్టులు పెండింగ్ లో ఉన్నట్లు వివరించారు.
చేయాల్సిన టెస్టులు, నివేదికలు పూర్తికాకముందే గోదావరి నదికి ముందస్తుగా వచ్చిన వరదల కారణంగా దిగువ కాపర్ డ్యాం ప్రాంతంలోకి వరద నీరు చేరిందని అధికారులు సీఎంకు తెలిపారు. వరదలు పూర్తిగా తగ్గిన తర్వాత ఈ పరీక్షలు నిర్వహించి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న దిగుప కాఫర్ డ్యామ్ పనులకు కూడా వరదల వల్ల బ్రేక్ పడిందనవి.., నదిలో నీరు 2లక్షల క్యూసెక్కులకు తగ్గితేగానీ పనులు చేపట్టడానికి వీలుగా ఉండదని తెలిపారు.
దీనిపై స్పందించిన సీఎం జగన్.. అధికారులకు కీలక సూచనలిచ్చారు. వరద తగ్గిన వెంటనే పనులు ముమ్మరంగా సాగడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఇక ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. కేంద్రం నుంచి రూ.2900 కోట్లు రీయింబర్స్ చేసుకోవాల్సి ఉందని సీఎం.. అధికారులతో చెప్పారు. అలాగే పనులు వేగంగా జరగడానికి రూ.6వేల కోట్లను కేంద్రం నుంచి రప్పించుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇది చదవండి: ఏపీలో వర్షాలు తగ్గుతాయా.? పెరుగుతాయా..? తాజా అప్ డేట్ ఇదే..!
కాంపొనెంట్ వైజ్‌గా రీయింబర్స్ చేసే విధానంలో కాకుండా.. అడహాక్‌గా డబ్బులు తెప్పించుకుంటే పనులు మరింత వేగంగా జరిగే అవకాశముంటుందని జగన్ అభిప్రాయపడ్డారు. ఆ అంశంపై కేంద్రానికి లేఖలు రాయాలను అదికారులను ఆదేశించారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు సంబంధించిన హెడ్ వర్క్స్, కనెక్టివిటీ పనులపై దృష్టి పెట్టాలన్నారు. ఇదిలా ఉంటే గోదావరిలో వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 16.30 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లో ఉంది. దీంతో లంక గ్రామాల్లో వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.