Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN CONDUCTED REVIEW MEETING ON INCOME SOURCES AND ISSUED KEY ORDERS TO OFFICIALS FULL DETAILS HERE PRN GNT

YS Jagan: పన్నుల వసూళ్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. మరోసారి ఓటీఎస్ సిస్టమ్.. వివరాలివే..!

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

రాష్ట్రానికి ఆదాయాలు పెంచే మార్గాలపై సీఎం జగన్ (AP CM YS Jagan) దృష్టిపెట్టారు. ఈ మేరకు పన్ను బకాయిల వసూళ్లకు కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

    రాష్ట్రానికి ఆదాయాలు పెంచే మార్గాలపై సీఎం జగన్ (AP CM YS Jagan) దృష్టిపెట్టారు. ఈ మేరకు పన్ను బకాయిల వసూళ్లకు కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం రెవెన్యూ అందించే శాఖలపై సమీక్షించిన సీఎం జగన్.. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్, రవాణా, భూగర్భగనులు, అటవీ తదితర శాఖల అధికారులతో చర్చించారు. శాఖల వారీగా సమీక్షించిన జగన్.. వారికి కీలక ఆదేశాలిచ్చారు. ఆయా శాఖల్లో ప్రొఫెషనలిజం పెంచుకుని ఆదాయాలు పెంచుకోవాలని సూచించారు. ఓటీఎస్‌ పథకం కింద లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లను వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే టిడ్కోకు సంబంధించి కూడా రిజిస్ట్రేషన్లను పూర్తిచేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోకి రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తీసుకు వచ్చాక సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం పేర్కొన్నారు.

    సచివాలయాల్లో కేవలం ఆస్తుల రిజిస్ట్రేషనే కాకుండా.. రిజిస్ట్రేషన్‌ పరంగా అందించే ఇతర సేవలపైన కూడా పూర్తిస్థాయి సమాచారం, అవగాహన కల్పించాలని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియతో న్యాయపరంగా ఎలాంటి హక్కులు వస్తాయి, ఎలాంటి భద్రత వస్తుందన్న దానిపై కూడా అవగాహన కల్పించాలన్నారు. అక్టోబరు 2న తొలివిడతగా గ్రామాల్లో శాశ్వత భూ హక్కు, భూ రక్ష పత్రాలతో పాటు సంబంధిత సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు.

    ఇది చదవండి: వల్లభనేని వంశీ, కొడాలి నాని జూమ్ ఎంట్రీపై క్లారిటీ.. అందుకే వచ్చారన్న విజయసాయి రెడ్డి


    ప్పటికే 650 గ్రామాల్లో జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్‌ సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ గ్రామాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. అలాగే 14వేలమంది గ్రామ, వార్డు సెక్రటరీలకు రిజిస్ట్రేషన్‌పై శిక్షణ కూడా అందిస్తున్నామన్నారు.

    ఇది చదవండి: ఇక జనంలోకి జనసేనాని.., దసరా నుంచి పవన్ యాత్ర.. వివరాలివే..!


    తొలివిడత కింద రిజిస్ట్రేషన్‌ సేవలు, భూ హక్కు–భూ రక్ష కింద పత్రాలు అందించే గ్రామాల సంఖ్యను పెంచడానికి ప్రయత్నించాలన్న సీఎం స్పష్టం చేశారు. వెదురు పెంపకాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖకు ఆదేశించారు. మైనర్‌ మినరల్‌కు సంబంధించి కార్యకలాపాలు నిర్వహించని క్వారీలు 2,700కుపైగా ఉన్నాయని అధికారులు సీఎం కు తెలిపారు. వీటిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై స్పందించిన సీఎం.. వీటిలో కార్యకలాపాలు ప్రారంభం కావడంపై దృష్టిపెట్టాలని.., దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయాలు పెరుగుతాయిని చెప్పారు.

    ఇది చదవండి: వివాదంలో నయనతార దంపతులు.. తిరుమలలో అపచారం..?


    ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభమైనట్లు అధికారులు చెప్పగా.. జెన్‌కో సహా.. రాష్ట్రంలోని పలు పరిశ్రమలకు దీని నుంచి బొగ్గు సరఫరా అయ్యేలా చూసుకోవాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల జెన్‌కో ఆధ్వర్యంలోని విద్యుత్‌ ప్రాజెక్టులకు మేలు జరుగుతుందన్నారు.



    ఇక వాణిజ్య పన్నుల శాఖ పునర్‌నిర్మాణానికి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. శాఖలో ప్రతి ఒక్కరి పాత్ర, బాధ్యతలపై సీఎం స్పష్టతనిచ్చారు. ఇందులో డాటా అనలిటిక్స్‌, లీగల్‌సెల్‌కూడా ఏర్పాటు చేశారు. పన్నుల బకాయిల వసూలుకు ఓటీఎస్‌ సదుపాయం కల్పించాలని జగన్ ఆదేశించారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు