AP CM YS JAGAN CONDUCTED REVIEW MEETING ON HEALTH DEPARTMENT AND ISSUED KEY ORDERS ON AROGYASREE SCHEME IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
YS Jagan: మరింత పటిష్టంగా ఆరోగ్యశ్రీ.. ఇకపై వైద్యం మరింత ఈజీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు..
ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆరోగ్య శ్రీ (Arogya Sree) అమలును మరింత పటిష్టం చేయాలని సీఎం జగన్ (AP CM YS Jagan) ఆదేశించారు. మంగళవారం వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, ఆరోగ్యశ్రీ పై క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. నాడు–నేడుతో పాటు వైద్య ఆరోగ్యశాఖలో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఆరోగ్య శ్రీ (Arogya Sree) అమలును మరింత పటిష్టం చేయాలని సీఎం జగన్ (AP CM YS Jagan) ఆదేశించారు. మంగళవారం వైద్య ఆరోగ్యశాఖలో నాడు-నేడు, ఆరోగ్యశ్రీ పై క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. నాడు-నేడుతో పాటు వైద్య ఆరోగ్యశాఖలో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలని.., పొరపాట్లకు, అక్రమాలకు ఆస్కారం లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఆరోగ్య శ్రీకి పేషెంట్లను రిఫర్‌చేసే విధానం పక్కాగా ఉండాలన్న ఆయన.. రిఫరల్ విధానాన్ని పర్యవేక్షణ చేయాలన్నారు. విలేజ్ క్లినిక్స్‌లో రిఫరల్ కోసం పర్మినెంట్ ప్లేస్‌ను డిజైన్ చేయాలని.., విలేజ్ క్లినిక్స్ అన్నవి రిఫరల్ కేంద్రాలుగా పనిచేస్తాయని తెలిపారు. ఎక్కడికి రిఫరల్ చేయాలన్నదానిపై హోర్డింగులు ఏర్పాటు చేయడంతో పాటు, అక్కడ పూర్తి సమాచారాన్ని ఉంచాలని సూచించారు.
ఆరోగ్యశ్రీ అందుకున్న తర్వాత లబ్ధిదారులకు లేఖ అందాలని.., పథకం ద్వారా తనకు అందిన లబ్ధిని అందులో పేర్కొనాలని సీఎం చెప్పారు. ఆరోగ్యశ్రీలో ఆస్పత్రి నుంచి పేషెంట్ బయటకు వెళ్తున్నప్పుడు తనకు అందిన వైద్య సేవలపై కన్ఫర్మేషన్ తీసుకోవాలన్న సీఎం.., పేషెంట్ తిరిగి కోలుకున్నంతవరకూ అందిస్తున్న ఆరోగ్య ఆసరా విషయాలు కూడా కన్ఫర్మేషన్ పత్రంలో ఉండాలని చెప్పారు. ఆరోగ్య ఆసరా డబ్బు నేరుగా వారి వ్యక్తిగత ఖాతాకు డీబీటీ విధానంలో చేస్తున్న పద్ధతిని కొనసాగించాలన్నారు.
ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు ప్రత్యేక ఖాతాలను తెరవాలన్న సీఎం.. ఆరోగ్యశ్రీ కింద అందించే డబ్బును నేరుగా ఈ ఖాతాకు పంపాలని.. అక్కడి నుంచి ఆటోమేటిక్ గా వైద్యం అందించిన ఆస్పత్రికి వెళ్లాలన్నారు. ఈమేరకు కన్సెంట్ పత్రాన్ని పేషెంట్‌నుంచి తీసుకోవాలని ఆదేశించారు. తన వ్యక్తిగత ఖాతా విషయంలో ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా ఈ ప్రత్యేక అకౌంట్ వినియోగపడుతుందని.., ఈ విధానాల వల్ల పారదర్శకత వస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు.
ఇది చదవండి: టీడీపీ విషయంలో పవన్ మెట్టుదిగనిది అందుకే..! తగ్గితే జరిగే నష్టాన్ని ముందే ఊహించారా..?
ఆరోగ్యశ్రీ కింద అందుతున్న వైద్య సేవలకు ప్రభుత్వం మొత్తం చెల్లిస్తుందని.., దీనికి అదనంగా డబ్బు వసూలు చేసే పరిస్థితి ఉండకూడదన్నారు. ఒకవేళ ఎవరైనా అదనంగా డబ్బులు వసూలు చేస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామన్న సంకేతం వెళ్లాలని ఆదేశించారు. అదనంగా తన వద్దనుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదన్న కన్ఫర్మేషన్ పేషెంట్ నుంచి తీసుకోవాలన్నారు. పేషెంట్ అస్పత్రిలో చేరిన దగ్గరనుంచీ డిశ్చార్జి అయ్యేంత వరకూ వారికి అండగా, తోడుగా నిలవాలని జగన్ అన్నారు. ఆరోగ్య శ్రీలో అవసరమైన ఇప్పుడున్న 2436 చికిత్సలను ఇంకా పెంచాలని సీఎం సూచించారు. వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే.. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందే దిశగా అడుగులు ముందుకు వేయాలన్నారు. అలాగే 108, 104, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లలో లంచాలకు ఆస్కారం ఉండకూడద సీఎం జగన్ స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో ఖాళీల భర్తీ, ప్రమాణాలకు అనుగుణంగా వైద్య ఆరోగ్యశాఖలో సిబ్బంది నియామకంపై సీఎం సమీక్ష జరిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 40,188 పోస్టులు భర్తీచేశామని అధికారులు వివరించారు. 176 కొత్త పీహెచ్‌సీలకు సంబంధించి ఇంకా డాక్టర్లు అవసరమని, ఈ పీహెచ్‌సీల నిర్మాణం పూర్తికాగానే వారిని నియమిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా సిబ్బంది కొరత ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (వ్యాక్సినేషన్ అండ్ కోవిడ్ మేనేజిమెంట్) ఎం రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.