ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ఇపై సర్కారు బడుల్లో స్మార్ట్ టీచింగ్ విధానం అమల్లోకి రానుంది. శుక్రవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ (AP CM YS Jagan).. అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ స్కూళ్లలో సరికొత్త టెక్నాలజీతో కూడిన విద్యనందించేందుకు ఏర్పాటు చేసిన డిజిటల్ డిస్ ప్లేకి సంబంధించి వివిధ కంపెనీల పరికరాలను సీఎం పరిశీలించారు. వీటితో పాటు పాఠశాలల్లో నాడు-నేడు కింద జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. రెండో దశ నాడు నేడు పనులు మరింత వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో ఖరీదైన పరికరాలను ఏర్పాటు చేస్తున్నందున తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. స్కూళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేదిశగా ఆలోచించాలన్నారు.
అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకునే క్రమంలో విద్యావ్యవస్థ చేపడుతున్న కార్యక్రమాల డేటా నిరంతరం అప్ లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు ఎస్ఐపీలను రూపొందించాలని స్పష్టంచేశారు. టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌లను సమర్థవంతంగా వినియోగించుకుని స్కూళ్ల నిర్వహణను పటిష్టం చేయాలని సీఎం అన్నారు.
ఇక క్లాస్ రూముల్లో డిజిటల్ పరికరాల ఏర్పాటు ఇతర మౌలిక సదుపాయాలపైనా సీఎం సమీక్షించారు. విద్యార్థులకు సబ్జెక్టులు బాగా అర్ధమయ్యేలా బోధన ఉండాలని.. ఇందుకోసం ప్రతి క్లాస్ రూమ్ లో ఇంటరాక్టివ్ డిస్ ప్లేలు లేదా ప్రొజెక్టర్లు ఏర్పాటు చేయాలని జగన్ అన్నారు. వీటి ఏర్పాటు మరింత వేగంగా సాగాలన్ను. స్మార్ట్ టీచింగ్ వల్ల పిల్లలకు, టీచర్లకు మేలు జరుగుతుందన్నారు. స్కూళ్లలో ఏఱ్పాటు చేసి టీవీలు, ప్రొజెక్టర్ల నాణ్యత విషయలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు సీఎం జగన్.
పీపీ-1 నుంచి రెండో తరగతి వరకూ స్మార్ట్ టీవీలు, 3వ తరగతి ఆపైన ప్రొజెక్టర్‌లు ఏర్పాట్లు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైస్కూళ్లు, నాడు-నేడు పూర్తి చేసుకున్న స్కూళ్లలో మొదటి దశక కింద వీటిని ఏర్పాటు చేయాలని జగన్ ఆదేశించారు. వారం రోజుల్లో దీనిపై కార్యాచరణ రెడీ అవ్వాలన్నారు. అలాగే సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబులపై సీఎం చర్చించారు. మంచి క్వాలిటీతో ఉన్న ట్యాబ్ లను విద్యార్థులకు ఇవ్వాలని.. వాటిలోకి బైజూస్ కంటెట్ ను అప్ లోడ్ చేయాలన్నారు.
ఇక వచ్చే విద్యాసంవత్సరానికి గానూ ప్రభుత్వం అందించే విద్యాకానుకకు ఇప్పటి నుంచే సన్నద్ధత ఉండాలన్నారు సీఎం జగన్. విద్యాశాఖలో చేస్తున్న సంస్కరణలపై పర్యవేక్షణ ఉండాలన్న సీం.. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న డీఈఓ, ఎంఈవో పోస్టులన్నీ వెంటనే భర్తీ చేయాలన్నారు. సమావేశంలో విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP Schools