Home /News /andhra-pradesh /

AP CM YS JAGAN CONDUCTED REVIEW MEETING ON EDUCATION DEPARTMENT AND ISSUE KEY ORDERS FULL DETAILS HERE PRN

YS Jagan: ఇకపై ఆ మాట వినిపించకూడదు.. ఆ విషయంలో తగ్గేదేలే..! అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు..

సీఎం జగన్ (ఫైల్)

సీఎం జగన్ (ఫైల్)

రాష్ట్రంలోని ప్రతి స్కూల్ కి తప్పనిసరిగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలని సీఎం జగన్ (AP CM YS Jagan) స్పష్టం చేశారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. కీలక ఆదేశాలిచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India
    రాష్ట్రంలోని ప్రతి స్కూల్ కి తప్పనిసరిగా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలని సీఎం జగన్ (AP CM YS Jagan) స్పష్టం చేశారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. కీలక ఆదేశాలిచ్చారు. ప్రతి స్కూల్ కు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో పాటు పాఠ్యాంశాలన్నీ పీడీఎఫ్ రూపంలో సేవ్ చేయాలని.. అవి నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేకాధికారిని నియమించాలన్నారు. అలాగే పాఠశాలల్లో ఎలాంటి రిపేర్లు చేయాలన్నా.. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఇక వచ్చే ఏడాది అమలు చేయనున్న జగనన్న విద్యాకానుక పథకంపై కీలక ఆదేశాలిచ్చారు. ఏప్రిల్ చివరినాటికే విద్యాకానుక కిట్ లోని వస్తువులను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

    ఇక 8వ తరగతి విద్యార్థులకు అందించే ట్యాబ్ లపై సీఎం కీలక సూచనలిచ్చారు. ట్యాబ్ లను వెంటనే ప్రొక్యూర్ చేసేలా ఆదేశాలివ్వాలన్న సీఎం.. ప్రతి క్లాస్ రూమ్ లో డీజిటల్ టీచింగ్ కోసం టీవీ ఏర్పాటు చేయాలని చెప్పారు. అలాగే దశలవారీగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాడు-నేడు పనులు పూర్తయిన స్కూళ్లపై ప్రధానంగా దృష్టిపెట్టాలని.. ఇందుకోసం ఎస్ఓపీలను రూపొందించాలన్నారు. తర్వాతి జరిగే సమావేశం నాటికి దీనికి సంబంధించిన విధివిధానాలను తన టేబుల్ పై ఉంచాలన్నారు సీఎం. రాష్ట్రంలోని ప్రతి స్కూల్ కు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలని.. బోధనాప్రమాణాలు పెరగాలంటే ఇంటర్నెట్ తప్పనిసరి అని సీఎం అభిప్రాయపడ్డారు.

    ఇది చదవండి: కృష్ణమ్మ ఉగ్రరూపం.. విజయవాడ పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్..


    ప్రతి స్కూల్లో డిజిటల్ బోధన జరగాలని.., స్మార్ట్‌ టీవీ లేదా ఇంటరాక్టివ్‌ టీవీ ఖచ్చితంగా ఉండాలన్నారు. అలాగే బుక్స్ లో ఉండే పాఠాలకు సంబంధించిన కంటెంట్ అందరికీ అందుబాటులో ఉండాలన్నారు. ప్రతిపాఠం పీడీఎఫ్ ఫార్మాట్ లో ఉండాలని.. ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్కరికీ పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రైవేట్ స్కూళ్లకు పుస్తకాలు కావాలంటే.. నిర్ణీత సమయంలోగా ఆర్డర్ తీసుకొని అందించాలని స్పష్టం చేశారు. పుస్తకాల కొరత అనే మాట వినిపించకూడదన్నారు.



    బాలికలకు భద్రతపై అవగాహన కల్పించాలని.., రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై స్కూళ్లలో విద్యార్థినులకు సరైన పద్ధతిలో చెప్పాలన్నారు. గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్‌ఎం తరచుగా స్కూళ్లకు వెళ్లి బాలికలకు రక్షణా పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. ప్రతి స్కూల్లో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై కౌన్సెలింగ్ ఇచ్చే బాధ్యతను ఒక మహిళా ఉపాధ్యాయురాలికి అప్పగించాలన్నారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government

    తదుపరి వార్తలు