AP CM YS JAGAN CONDUCTED REVIEW MEETING ON AGRICULTURE AHEAD OF NEW SEASON FULL DETAILS HERE PRN GNT
YS Jagan: ఒక్క మెసేజ్ తో రైతులకు సాయం.. సీఎం జగన్ కీలక ఆదేశాలు.. వివరాలివే..!
సీఎం జగన్ (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖపై సీఎ జగన్ (CM YS Jagan) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇ–క్రాపింగ్, ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖపై సీఎ జగన్ (CM YS Jagan) సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇ–క్రాపింగ్, ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కీలక దేశాలిచ్చారు.ఖరీఫ్ ప్రారంభం అవుతున్నందున రైతు పండించిన పంటను కచ్చితంగా ఇ–క్రాపింగ్ చేయాలని.. ఈ డేటా ఆధారంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, ఇతరత్రా ఏ కష్టం వచ్చినా రైతును ఆదుకునేందుకు వీలు ఉంటుందని జగన్ అన్నారు. ఇ–క్రాప్ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్న సీఎం.., ఇ–క్రాప్ చేసిన తర్వాత డిజిటల్ రశీదుతోపాటు, ఫిజికల్ రశీదుకూడా ఇవ్వాలని గతంలోనే స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. డిజిటల్ రశీదును నేరుగా రైతు సెల్‌ఫోన్‌కు పంపాలన్నారు.
ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఒకవేళ రైతుకు నష్టం వస్తే.. ఆ రశీదు ఆధారంగా రైతులు ప్రశ్నించగలిగే హక్కు వారికి వస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన ఎస్ఓపీని బలోపేతం చేయాలని.., వీఆర్వో, సర్వే అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ల జాయింట్ అజమాయిషీ బాధ్యతను అప్పగించాలని ఆదేశించారు. ఆ గ్రామంలో సాగుచేస్తున్న భూములు, సంబంధిత రైతుల వివరాలతో కూడిన మాస్టర్ రిజిస్టర్‌ను వీరికి అందుబాటులో ఉంచాలన్నారు.
జియో ట్యాగింగ్, ఫొటో గ్రాఫ్స్ ఇ–క్రాప్‌లో లోడ్ చేయాలన్న ముఖ్యమంత్రి.., జూన్ 15 నుంచి ఇ– క్రాపింగ్ మొదలుపెట్టి, ఆగస్టు చివరినాటి పూర్తిచేయాలని చెప్పారు. సెప్టెంబరు మొదటివారంలో సామాజిక తనిఖీచేపట్టాలని.., జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. ఉన్నతాధికారుల స్థాయిలో ప్రతి 15 రోజులకోసారి ఇ–క్రాపింగ్‌పై సమీక్ష, పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు. మండలస్థాయి, జిల్లా స్థాయిల్లో అధికారులు ఇ–క్రాపింగ్ జరుగుతున్న తీరును తనిఖీచేయాలని., ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర తీసివేయాలని ఆదేశాలిచ్చారు.
ఆర్బీకేల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరగాలన్న సీఎం.., ధాన్యం విక్రయం కోసం రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లే పరిస్థితులు ఉండకూడదన్నారు. ధాన్యం కొనుగోలు బాధ్యత పౌరసరఫరాల శాఖదేనని.., ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారికి డబ్బు చెల్లించే బాధ్యత కూడా పౌరసరఫరాల శాఖదేనని స్పష్టం చేశారు. రైతు నుంచి కొనుగోలు చేసిన తర్వాత... ఆ ధాన్యాన్ని వేరే వే–బ్రిడ్జి వద్ద తూకం వేయించి రశీదును రైతుకు ఇవ్వాలన్నారు. దీనివల్ల రైతుకు ఎంఎస్పీ లభిస్తుందని., రావాల్సిన ఎంఎస్పీలో ఒక్క రూపాయికూడా తగ్గకుండా రైతుకు రావాలన్నారు.
ఈ సమావేశానికి వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ ఎం వి యస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.