హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: ఏపీలాంటి విధానం దేశంలో ఎక్కడా లేదు.. ఆ మార్పు కనిపించాలన్న సీఎం.. అధికారులకు ఆదేశాలు

YS Jagan: ఏపీలాంటి విధానం దేశంలో ఎక్కడా లేదు.. ఆ మార్పు కనిపించాలన్న సీఎం.. అధికారులకు ఆదేశాలు

ఏపీ సీఎం జగన్ (file)

ఏపీ సీఎం జగన్ (file)

దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పథకాలు అమలవుతున్నాయని సీఎం జగన్ (AP CM YS Jagan) అన్నారు. గురువారం సుస్థిర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. కీలక ఆదేశాలిచ్చారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పథకాలు అమలవుతున్నాయని సీఎం జగన్ (AP CM YS Jagan) అన్నారు. గురువారం సుస్థిర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. కీలక ఆదేశాలిచ్చారు. నవరత్నాల పేరుతో ప్రభుత్వం లబ్ధిదారులకు రూ.1.65 లక్షల కోట్లను నేరుగా వారి ఖాతాలకే బదిలీ చేసిందని.. తద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని జగన్ అన్నారు. దేశంలో ఎక్కడా డీబీటీ పద్ధతి లేదని మన దగ్గరే అమల చేస్తున్నామని తెలిపారు. అన్ని రంగాల్లోనూ స్పష్టమైన ముద్రవేయగల పథకాలు ఏపీలోనే ఉన్నాయని.. ఇవన్నీ సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. సస్టెయినబలు డెవలప్ మెంట్ గోల్స్ కు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఖచ్చితంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.

ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్ డేట్ చేయడంతో పాటు పథకాల ద్వారా అందిస్తున్న ప్రయోజనాలను ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనిపై ఎన్ని రోజులకు సమావేశం కావాలనేదానిపై స్పష్టమైన సమాచారం ఉండాలని స్పష్టం చేశారు. మూడు నెలల పాటు నెలకు రెండుసార్లు చొప్పున సీఎస్ ఆధ్వర్యంలో సమావేశం కావాలన్నారు. ఈ సమావేశాల్లో వివిధ శాఖల కార్యదర్శులు తప్పనిసరిగా పాల్గొనాలని.. కలెక్టర్లతో కూడా మాట్లాడాలన్నారు. సుస్థిరాభివృద్ధిలో జాతీయ స్థాయిలో పోటీపడటం ద్వారా దేశంలోనే టాప్ లో నిలిచే అవకాశం వచ్చిందని.. గతంలో ఇలాంటి పరిస్థితి లేదని సీఎం అన్నారు.

ఇది చదవండి: ఏపీ సర్కార్ మరో పథకం.. వారి ఖాతాల్లోకి రూ.10వేలు.. వివరాలివే..!


ఇక విశాఖపట్నంలో అత్యాధునిక వసతులతో ఐటీ హబ్ నిర్మించాలన్న సీఎం.. అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఎలాంటి వివక్షకు తావులేకుండా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తున్నామని.. వీటికి సంబంధించిన రిపోర్టులు ఎప్పటికప్పుడు సిద్ధం చేయాలని సీఎం అన్నాలు. అలాగే ఎంఎస్ఎంఈలకు ఇస్తున్న ప్రోత్సహకాలు కూడా నేరుగా వారి ఖాతాల్లోకే వేస్తున్నామని.. గతంలో ఇలాంటి పద్ధతి లేదన్నారు.

ఇది చదవండి: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సుల్లో ఆ సమస్యకు చెక్.. ఆర్టీసీ వినూత్న ఆలోచన..!


జగనన్న అమ్మఒడి, టాయ్‌లెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌, స్కూల్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌, సంపూర్ణ పోషణ, గోరుముద్ద వంటి కార్యక్రమాలపై సరైన రిపోర్టులు లేవన్న సీఎం.. జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన పథకాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్ డేట్ చేయాలని తెలిపారు. ఇక ఆరోగ్యశ్రీలో అందిస్తున్న 3 వేల చికిత్సా విధానాలు, 16 కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, నాడు-నేడుతో ఆస్పత్రుల అభివృద్ధి, ఆరోగ్య ఆసరా లాంటి కార్యక్రమాలు గతంలో లేవని.. వీటిపైనా సమాచారం అప్ డేట్ చేయాలన్నారు సీఎం. మహిళల కోసం అమలు చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా, సున్నావడ్డీ పథకం, ఇళ్లపట్టాల వంటి పథకాలను కూడా హైలెట్ చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy

ఉత్తమ కథలు