హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలో ఇసుక మాఫియాకు చెక్... సీఎం జగన్ కొత్త ప్లాన్

ఏపీలో ఇసుక మాఫియాకు చెక్... సీఎం జగన్ కొత్త ప్లాన్

ప్రభుత్వం తీరుపై విపక్షాల విమర్శ

ప్రభుత్వం తీరుపై విపక్షాల విమర్శ

ఇకపై బల్క్ బుకింగ్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ ల పర్యవేక్షణలోనే అనుమతించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.

ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారులకు ఇసుకను సులభంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్  సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈనెల 5న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం నూతన ఇసుక పాలసీని ప్రకటించిన తరువాత ఎపిఎండిసి ద్వారా పారదర్శకతతో ఇసుక విక్రయాలను నిర్వహిస్తున్నామని అన్నారు. దేశంలోనే ఆన్ లైన్ విధానంలో ఇసుకను వినియోగదారులకు డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఎపికి గుర్తింపు వుందని అన్నారు. అదే క్రమంలో ఇసుక మాఫియాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు రీచ్ లు, స్టాక్ పాయింట్లు, చెక్ పోస్ట్ లలో సిసి కెమేరాలు ఏర్పాటు చేయడం, గనుల శాఖ, రెవెన్యూ, రవాణాశాఖల ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో (ఎస్ఇబి) ద్వారా తనిఖీలు చేయడం ద్వారా అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేసిన వారికి రెండేళ్ళ జైలుశిక్ష, రెండు లక్షల రూపాయల వరకు జరిమానా విధించేలా ప్రభుత్వం చట్టాన్ని చేసింది తెలిపారు.

ఇకపై సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్

ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్ లు నిర్వహించేందుకు ఈ నెల 5న జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. అధికారిక ఉత్తర్వులు వెలువడగానే సచివాలయాల ద్వారా కూడా ఇసుక బుకింగ్  చేసుకునే అవకాశం వుంటుందని తెలిపారు.

స్థానికులకు ఎడ్లబండ్ల ద్వారా ఉచిత ఇసుకకు అనుమతి

రాష్ట్రంలో వాగులు, వంకలతో పాటు చిన్న నీటిపాయల నుంచి ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా స్థానికులు వాడుకునేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. గతంలో వాగులు, వంకలకు చెందిన 1 నుంచి 3వ ఆర్డర్ స్ట్రీమ్ ల నుంచి మాత్రమే ఎడ్లబండ్ల ద్వారా ఉచిత ఇసుక తీసుకునే వీలుండేదని అన్నారు. తాజాగా ఇసుక పాలసీపై ముఖ్యమంత్రి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నదులు, జలవనరులకు సమీపంలోని గ్రామాల్లోని ప్రజలు తమ అవసరాల కోసం ఎడ్లబండ్ల ద్వారా తీసుకునే ఉచిత ఇసుక పరిధిని 4, 5 ఆ పై ఆర్డర్ స్ట్రీమ్ ల వరకు కూడా పెంచాలని ఆదేశించినట్లు తెలిపారు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుందని అన్నారు. గుర్తించిన వాటర్ స్ట్రీమ్ ల నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలోని గ్రామాల ప్రజలు ఉచితంగా ఇసుకను ఎడ్లబండ్ల ద్వారా పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. దీనివల్ల జలవనరుల సమీపంలోని ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుందని, ఇసుక బుకింగ్ లపై వత్తిడి తగ్గుతుందని అన్నారు.

ప్రస్తుతం రోజుకు సుమారుగా 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలుప్రస్తుతం రోజుకు సగటున 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని, దీనిని అతిత్వరలోనే రోజుకు మూడు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రానున్న వర్షాకాలం అవసరాల కోసం మొత్తం డెబ్బై లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేస్తున్నట్లు వెల్లడించారు. ఓపెన్ రీచ్ లలో కూలీలతోనే ఇసుక తవ్వకాలుపర్యావరణ నిబంధనల ప్రకారం నాణ్యమైన ఇసుక అందించే నదుల్లోని ఓపెన్ రీచ్ లలో కూలీలతోనే ఇసుక తవ్వకాలు జరుపుతున్నామని అన్నారు.  జిల్లాల్లోని కలెక్టర్ల ద్వారా తిరిగి ఇసుక తవ్వకాల్లో నైపూణ్యం వున్న వలస కూలీలను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ప్రత్యేక బృందాలతో ఇసుక పై పూర్తి పర్యవేక్షణ

ఇసుక ఆపరేషన్లపై జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. జిల్లాలో టెక్నికల్ టీంల ఆధ్వర్యంలో రీచ్ లు, పట్టాభూముల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పర్యవేక్షిస్తున్నామని అన్నారు. పట్టాభూముల్లో ఇసుక నాణ్యతను టెక్నికల్ టీం పరిశీలించిన తరువాతే వాటికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. అలాగే ఇకపై బల్క్ బుకింగ్ లను జిల్లా జాయింట్ కలెక్టర్ ల పర్యవేక్షణలోనే అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap new sand policy

ఉత్తమ కథలు