హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Govt Employees PRC : పది రోజుల్లో పీఆర్సీ.. ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..

AP Govt Employees PRC : పది రోజుల్లో పీఆర్సీ.. ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..

జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. కరోనా నివారణ చర్యలు, ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహ హక్కులు, ఉపాధిహామీ, సుస్థిరాభివృద్ధిపై సమీక్షించారు సీఎం జగన్‌. ఈ సంధర్భంగా కరోనా పరిస్థితులపై అధికారులను హెచ్చరించారు..

జిల్లా కలెక్టర్లతో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. కరోనా నివారణ చర్యలు, ఇళ్ల పట్టాలు, జగనన్న కాలనీలు, సంపూర్ణ గృహ హక్కులు, ఉపాధిహామీ, సుస్థిరాభివృద్ధిపై సమీక్షించారు సీఎం జగన్‌. ఈ సంధర్భంగా కరోనా పరిస్థితులపై అధికారులను హెచ్చరించారు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా నికి (Andhra Pradesh Governmet), ఉద్యోగులకు (AP Government Employees) మధ్య కొంతకాలంగా పీఆర్సీ నివేదికపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) శుభవార్త చెప్పారు. పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్నారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వా నికి (Andhra Pradesh Governmet), ఉద్యోగులకు (AP Government Employees) మధ్య కొంతకాలంగా పీఆర్సీ నివేదికపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) శుభవార్త చెప్పారు. తిరుపతిలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలిస్తున్న సందర్భంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఆయన్ను కలిశారు. పీఆర్సీ నివేదిక అంశాన్ని ఉద్యోగులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. దీనికి సంబంధించిన కసరత్తు పూర్తైందని జగన్ వారికి చెప్పారు. అలాగే 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని తెలిపారు. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. పీఆర్సీ నివేదిక వచ్చి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం విడుదల చేయుకండా జాప్యం చేస్తోందని కొందకాలంగా ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ ప్రకటన వారికి ఊరటనిచ్చింది.

  ఇదిలా ఉంటే పీఆర్సీతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలంటూ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు ఇటీవలే ఉద్యమ కార్యాచరణకు సంబంధించి నోటీసులిచ్చాయి. ఈనెల 7 నుంచి నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని.. 10వ తేదీ నుంచి లంచ్ విరామ సమయంలో నిరసన తెలుపుతామని ప్రకటించాయి. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించాయి.

  ఇది చదవండి : తిరుపతిలో సీఎం జగన్ పర్యటన.. వరద బాధితులకు భరోసా..  ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణను ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. శుక్రవారం సమావేశానికి రావాల్సిందిగా ఉద్యోగ సంఘాలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో పీఆర్సీ నివేదక, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డులు తదితర అంశాలపై చర్చించనున్నారు.

  ఇది చదవండి: అఖండ మూవీకి అధికారుల బ్రేక్.. ఏపీలో థియేటర్ సీజ్.. కారణం ఇదే..!


  పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ స్పందించారు. సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నామన్న బండి.. తాము ఇచ్చిన 71 డిమాండ్లలో ముఖ్యంగా పీఆర్సీ, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదకను వెంటనే బయటపెట్టాలని కోరారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో సరైన సమాధానం రాకుంటే తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.


  ఇది చదవండి: పోలవరం ట్రోల్స్ పై మంత్రి అనిల్ రియాక్షన్.. దమ్ముంటే ఆ పనిచేయాలని సవాల్..


  పీఆర్సీపై సీఎం ప్రకటనపై హర్షించదగ్గ విషయమన్న అమరావతి జేఏసీ నేత బొప్పరాజు తెలిపారు. తమను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా పీఆర్సీ నివేదికను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం చెప్పిన మాట ప్రకారం ఉన్నతాధికారులు వెంటనే నివేదిక ఇవ్వాలన్నారు. అన్ని డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే ఉద్యమాన్ని విరమిస్తామని స్పష్టం చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government, Employees

  ఉత్తమ కథలు