హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

YS Jagan: పీఏగా పెట్టుకుంటే అందరి నోళ్లూ మూయిస్తా.. సీఎంను కోరిన విద్యార్థి.. జగన్ ఏమన్నారంటే..!

YS Jagan: పీఏగా పెట్టుకుంటే అందరి నోళ్లూ మూయిస్తా.. సీఎంను కోరిన విద్యార్థి.. జగన్ ఏమన్నారంటే..!

బెండపూడి విద్యార్థులతో సీఎం జగన్

బెండపూడి విద్యార్థులతో సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan) గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి విద్యార్థులను ప్రత్యేకంగా కలిశారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (CM YS Jagan) గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి విద్యార్థులను ప్రత్యేకంగా కలిశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఇంగ్లిష్ లో అదరగొడుతున్న విద్యార్థుల ప్రతిభ చూసి జగన్ మురిసిపోయారు. ఒక్కో విద్యార్థిని ప్రత్యేకంగా పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకున్న జగన్.. వారి గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు ఎదురుగా ఉన్నా విద్యార్థులు మాత్రం ఎలాంటి భయం, బెరుకు లేకుండా ధైర్యంగా ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పథకాలు, స్కూళ్ల అభివృద్ధి వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇంగ్లీష్ నేర్చుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పోటీపడవచ్చని.. మీరు అమలు చేస్తున్న పథకాలు చక్కగా ఉన్నాయని రేష్మ అనే విద్యార్థిని చెప్పింది. విద్యార్థులకు మంచి కార్యక్రమాలు అమలు చేస్తున్నారంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం ఎంతో ఉపయోగపడుతోందని మేఘన అనే విద్యార్థిని చెప్పింది. అంతేకాకుండా ఇంగ్లీష్ ద్వారా తాను మంచి వక్తగా మారానని.. మీ ఇంగ్లీష్ ఇంటర్వ్యూలు ఎంతగానో ఉయోగపడ్డాయంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి చెప్పింది.


ఇది చదవండి: ఏపీలో కొత్త కార్యక్రమం.. ఈ నెంబర్ కు కాల్ చేస్తే ఇంటికే పశువైద్యం.. ప్రారంభించిన జగన్..

అలాగే అనుదీప్ అనే 7వ తరగతి విద్యార్థి మాత్రం సీఎం జగన్ ఆకట్టుకున్నాడు. ఇంగ్లీష్ లో అదరగొడుతూనే తాను పెద్దయ్యాక ఐఏఎస్ అవుతానని.. అప్పుడు మీ పీఏగా అవకాశం ఇస్తే.. మీపై వచ్చే విమర్శలను తిప్పికొడాతనని ప్రామిస్ చేస్తున్నాని.. మీరు కూడా ప్రామిస్ చేయాలని కోరాడు. దీంతో సీఎంతో సహా అక్కడున్నవారంతూ నవ్వుకున్నారు.

ఇది చదవండి: లండన్ కోర్టులో జగన్ సర్కార్ చారిత్రక విజయం.. కీలక కేసులో గెలుపు.. వివరాలివే..!


అనంతరం విద్యార్థులందరితోనూ ముచ్చటించిన సీఎం జగన్ వారి నోట్ బుక్స్ పై స్వయంగా సంతకం చేసి ఆల్ ది బెస్ట్ అని రాశారు. ఈ క్రమంలో మేఘనే అనే విద్యార్థిని తన కిడ్డీ బ్యాంక్ లో దాచుకున్న రూ.929ను సీఎం జగన్ కు ఇవ్వగా.. ఆయన మాత్రం 19 రూపాయలు తీసుకొని మిగిలిన మొత్తాన్ని తిరిగి మేఘనకే ఇచ్చేశారు.

ఇది చదవండి: ఏపీలో విద్యుత్ వినియోగదారులకు అలర్ట్.. హద్దుమీరితే జరిమానా గ్యారెంటీ..!


ఇదిలా ఉంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోగా.. విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశముందని పలువురు కోర్టుకెళ్లిన సంగతి తెలిసింది. గతంలో కోర్టు విద్యార్థులకు ఆప్షన్స్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లీష్ లో అదగొడుతుండటం వారి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఎం జగన్ స్వయంగా వారిని పిలిపించుకొని మాట్లాడారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, EDUCATION

ఉత్తమ కథలు