ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం పీఆర్సీ (PRC Issue) ఫైట్ నడుస్తోంది. ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగుల మధ్య జీతాలకు సంబంధించిన పంచాయతీ కొనసాగుతోంది. క్రమంగా పీఆర్సీ మేటర్ సీరియస్ టర్న్ తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ నచ్చలేదంటూ ఉద్యోగ సంఘాలు ఉద్యమానికి దిగాయి. అంతేకాదు వచ్చేనెల 7 నుంచి సమ్మె చేయాలని కూడా డిసైడ్ అయ్యాయి. మరో రెండు రోజుల్లో సమ్మెకు సంబంధించిన నోటీసులను సీఎస్ కు ఇచ్చేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇంత కీలక సమయంలోనూ సీఎం జగన్ (AP CM YS Jagan) ఓ డేరింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఉద్యోగులు నిరసనలకు దిగుతున్న సమయంలోనే జగన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఉద్యోగుల ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా సీఎం మాత్రం వెనక్కి తగ్గలేదని కేబినెట్ లో టాక్ వినిపిస్తోంది.
శుక్రవారం ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీకి సంబందించిన జీవోలను కూడా ఆమోదించింది మంత్రివర్గం. ఏ పీఆర్సీపైన అయితే ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారో.. అదే జీవోలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులోనూ సీఎం జగన్ మాత్రం తన మార్క్ వీడలేదు. పీఆర్సీని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నా సీఎం మాత్రం ముందుకే వెళ్లారు.
ప్రభుత్వం పథకాల అమలులో ఉద్యోగల పాత్ర చాలా కీలకం. అయినా జగన్ మాత్రం వారి ఆందోళనలు, డిమాండ్లకు లొగ్గలేదు. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చలు, వారి డిమాండ్లు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న జగన్ 23శాతం ఫిట్ మెంట్ ను ప్రకటించారు. ఆ ప్రకటన సందర్భంగా సీఎం తాము ఎంత ఇవ్వగలమో అంతే ఇస్తునన్నామని జగన్ స్పష్టం చేశారు. ఐతే ఈ పీఆర్సీతో తమ జీతాలు తగ్గిపోతున్నాయని ఉద్యోగులు వాదిస్తుంటే.. అలాంటిదేమీ లేదని ప్రభుత్వం చెబుతోంది.
ఉద్యోగులతో చర్చించిన తర్వాతే నిర్ణయాల తీసుకున్నాం కాబట్టి దానికే కట్టుబడి ముందుకెళ్లాలని సీఎం భావించారు. ఉద్యోగుల ఉద్యమాలు, ఆ తర్వాతి పర్యావసనాల గురించి జగన్ అవగాహన ఉంది. అయినా సీఎం మాత్రం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగానే ముందుకెళ్లారన్న చర్చ జరుగుతోంది. అనవసర గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకునేకంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్తేనే మంచిదని సీఎం భావించారని.. అందుకే ఓ వైపు ఉద్యోగ సంఘాలు ఉద్యమం గురించి చర్చించుకుంటున్న సమయంలోనే పీఆర్సీ జీవోలను కేబినెట్ లో ఆమోదింపజేశారంటున్నారు. మరి ఈ వివాదానికి సరైన ముగింపు ఇచ్చేందుకు సీఎం తగ్గుతారా..? లేక ఉద్యోగులు శాంతిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.