నేడు YSR నేతన్న నేస్తం ప్రారంభం... ఇవీ పథకం విశేషాలు

ఏపీ సీఎం జగన్ 47వ పుట్టిన రోజు సందర్భంగా... అనంతపురం... ధర్మవరంలో పర్యటించబోతున్నారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించబోతున్నారు.

news18-telugu
Updated: December 21, 2019, 6:37 AM IST
నేడు YSR నేతన్న నేస్తం ప్రారంభం... ఇవీ పథకం విశేషాలు
వైఎస్ జగన్
  • Share this:
ఓవైపు పుట్టిన రోజు మరోవైపు అద్భుత పథకం. చేనేత కార్మికుల కష్టాల్ని తొలగించే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న పథకమే వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం. ఇవాళ అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్న ఏపీ సీఎం జగన్... 'వైఎస్సార్‌ నేతన్న నేస్తం' పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ధర్మవరంలో భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభపైనే జగన్ 47వ జన్మదిన వేడుకలు కూడా జరపనున్నట్లు తెలిసింది. నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.24,000 అందించనుంది. అనంతపురం జిల్లాలో నేత మగ్గం కార్మికులు 27,481 మంది ఎంపికయ్యారు. వీరితోపాటూ... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 81,783 మంది నేత మగ్గం కార్మికులంతా ఈ పథకం నుంచీ ప్రయోజనం పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.196.27 కోట్లు ఖర్చు చేయబోతోంది. ఒక్కో మగ్గం నిర్వహణకు రూ.24 వేలు ఆర్థిక సాయం ఇస్తానని ప్రజా సంకల్ప యాత్రలోనే జగన్‌ ప్రకటించారు.


మరమగ్గాలు వచ్చాక చేనేతలకు ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. అప్పులు చేసి మరీ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. చాలా మగ్గాలు పాతవైపోయి... సరిగా పనిచెయ్యట్లేదు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో మగ్గాల్ని బాగు చేసుకోవడం, నూలు, రంగులు కొనేందుకు అవకాశం ఉంటుంది.
First published: December 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు