• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • AP CM JAGAN PROMISE TO VISKHA STEEL PLANT JAC FOR FIGHT AGAINST STEEL PLANT PRIVATIZATION NGS

Viskha steel plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: కార్మిక సంఘాలకు జగన్ హామీ

Viskha steel plant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తాం: కార్మిక సంఘాలకు జగన్ హామీ

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.. దేవుడి ఆశీస్సులతో కేంద్రం మనసు మారుతోందని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరమయ్యే అవకాశం లేదని ఆయన కార్మిక సంఘాలతో అన్నట్టు తెలుస్తోంది.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.. దేవుడి ఆశీస్సులతో కేంద్రం మనసు మారుతోందని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరమయ్యే అవకాశం లేదని ఆయన కార్మిక సంఘాలతో అన్నట్టు తెలుస్తోంది.

  • Share this:
    విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు నినాదం మారుమోగుతోంది. ఉక్కు ఉద్యమం మరింత ఉధృతం అవుతోంది. ఈ సమయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులకు సీఎం జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు.. విశాఖలో పర్యటిస్తున్న సీఎం జగన్ తో మొదట విమానాశ్రయంలో ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా వారు సీఎంను కోరారు. ఎన్‌ఎండీసీని విశాఖ ఉక్కుతో అనుసంధానించాలని, అలాచేస్తే సొంత గనుల సమస్య తీరుతుందని వివరించారు. ఈ అనుసంధానానికి కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కార్మిక సంఘం ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల పాటు కార్మిక సంఘ నాయకులతో ఆయన మట్లాడారు. గతంలో ఓ ఎన్ఎండీసీ గనులతో జరిగిన ఒప్పందంపై మళ్లీ సమీక్ష చేస్తానని హామీ ఇచ్చారు. పొస్కో విశాఖ స్టీల్ ప్లాంట్ కు వచ్చే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డారు. గతంలో పొస్కో ప్రతినిధులతో చర్చ జరిగినప్పుడు కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై చర్చించనన్నారు. దేవుని ఆశీస్సులతో స్టీల్ ప్లాంట్ విషయంపై కేంద్రం ఆలోచన మార్పు వస్తుందని భావిస్తున్నాను అని కార్మిక సంఘాలతో జగన్ అన్నట్టు సమాచారం. స్టీల్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ఉద్యమం చేయాలని కార్మిక సంఘాలను సీఎం జగన్ కోరినట్టు తెలుస్తోంది.

    సీఎం తీరుపై విపక్షాలు మాత్రం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. కార్మిసంఘాలతో పెద్దగా చర్చించకుండానే వారి నుంచి లేఖ తీసుకుని.. అసెంబ్లీ తీర్మానం చేస్తామని చెప్పి వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా సీఎం జగన్ కు నిరసన సెగ తగిలే అవకాశం ఉండడంతో అనేకమంది నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. కొందరిని గృహనిర్బంధంలో పెట్టారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలయ్యాక మొదటిసారిగా విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి.. దానికంటే శారదాపీఠం వార్షికోత్సవానికే ప్రాధాన్యత ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి

    తరువాత పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదా పీఠం వార్షికోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. సీఎంకు ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ ఇతరులు స్వాగతం పలికారు. శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న తొలి రోజు కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. స్వయం జ్యోతి మండపం ఎదురుగా ఏర్పాటు చేసిన రాజ శ్యామల యాగంలో సీఎం పాల్గొన్నారు. నేటి నుంచి శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. .. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిల ఆధ్వర్యంలో అయిదు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి.

    ఉదయం 7:30 గంటలకు స్వరూపానందేంద్ర సరస్వతి ఉత్సవాలకు అంకురార్పణ చేసి పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. దేశ రక్షణ, లోక కల్యాణార్థం రాజశ్యామల యాగం వేదోక్తంగా ప్రారంభమైంది. శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్న తరువాత సీఎం జగన్‌ అక్కడ స్వామీజీలతో కలిసి గోపూజ, శమీవృక్షం ప్రదక్షిణలో పాల్గొన్నారు.
    Published by:Nagesh Paina
    First published: