AP CM JAGAN MOHAN REDDY PAY HOMAGE TO HIS FATHER YS RAJASEKHARA REDDY AT IDUPULAPAYA KADAPA MK
తండ్రి సమాధి వద్ద జగన్ భావోద్వేగం...ఇడుపులపాయతో వైసీపీకి విడదీయరాని అనుబంధం...
తండ్రి సమాధికి నివాళి అర్పిస్తున్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి
ఇడుపుల పాయలో వైఎస్ సమాధి వద్ద జగన్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి సమాధి వద్దనే వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించగా, అక్కడి నుంచే ఓదార్పు యాత్ర, అలాగే పాదయాత్ర ప్రారంభించారు. అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న జగన్ సమాధి వద్ద విషాణ్ణ వదనంతో కనిపించారు.
ఆంధ్రప్రదేశ్ కు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డికి ఘనంగా నివాళి అర్పించారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ సమాధిని సందర్శించిన జగన్ పూలతో నివాళి అర్పించి, మౌనంగా ప్రార్థనలు చేశారు. జగన్ తో పాటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి అలాగే పలువురు పార్టీ నేతలు జగన్ వెంట ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ కు ఆహ్వానం పలికేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జగన్ వారందరికీ అభివాదం తెలుపుతూ ముందుకు కదిలారు. అంతకు మునుపు జగన్ పులివెందుల లోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాగా ఇడుపుల పాయలో వైఎస్ సమాధి వద్ద జగన్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి సమాధి వద్దనే వైఎస్సార్సీపీ పార్టీని స్థాపించగా, అక్కడి నుంచే ఓదార్పు యాత్ర, అలాగే పాదయాత్ర ప్రారంభించారు. అయితే ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న జగన్ సమాధి వద్ద విషాణ్ణ వదనంతో కనిపించారు. అలాగే అక్కడి వాతావరణంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు భావోద్వేగానికి గురయ్యారు.
తండ్రి సమాధి వద్ద భావోద్వేగానికి గురైన జగన్
ఇదిలా ఉంటే జగన్ మోహన్ రెడ్డి ఇడుపల పాయ నుంచి కడప చేరుకొని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు. కాగా రేపు విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం జగన్ తో పాటు సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ నేరుగా ఢిల్లీ చేరుకొని ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.