ముగిసిన సీఎం జగన్ అమెరికా టూర్...వివాదాలకు చెక్ పెట్టే చాన్స్...

అమెరికా పర్యటన సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కీలక అంశాలపై జగన్ సీరియస్ గా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా వరదలపై కీలక సమీక్ష జరిపే అవకాశం ఉంది. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు వరదలపై ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఎలా స్పందిస్తారనేది సస్పెన్స్ గా మారింది.

news18-telugu
Updated: August 23, 2019, 10:04 PM IST
ముగిసిన సీఎం జగన్ అమెరికా టూర్...వివాదాలకు చెక్ పెట్టే చాన్స్...
అమెరికాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన
  • Share this:
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని, స్వదేశానికి తిరుగుప్రయాణమయ్యారు. ఈ నెల 15న సీఎం జగన్ తన కుటుంబసభ్యులు, ప్రతినిధి బృందంతో కలిసి అమెరికా పయనమయ్యారు. అమెరికాలో పలు సదస్సుల్లో జగన్ పాల్గొని, పెట్టుబడులు పరిశ్రమలు ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఈ పర్యటనలో భాగంగా పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలపై జగన్ పలు సంస్థలతో చర్చించారు. కాగా అమెరికా పర్యటన ముగించుకుని ఈ తెల్లవారుజామున సియం జగన్ హైదరాబాద్ చేరుకోనున్నారు. తెల్లవారు జామున 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్న సియం జగన్, 4 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని తెల్లవారుజామున 4.30 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు.

కాగా అమెరికా పర్యటన సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న కీలక అంశాలపై జగన్ సీరియస్ గా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా వరదలపై కీలక సమీక్ష జరిపే అవకాశం ఉంది. అలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబు వరదలపై ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఎలా స్పందిస్తారనేది సస్పెన్స్ గా మారింది. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స రేపిన దుమారంపై కూడా సీఎం జగన్ స్పందించే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అలాగే పోలవరం రివర్స్ టెండరింగ్ గొడవతో పాటు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ల విషయంలో నెలకొన్న గొడవలపై కూడా జగన్ స్పందించే అవకాశం ఉంది.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు