Home /News /andhra-pradesh /

AP CM JAGAN MAY OFFERS CABINET MINISTER POST TO THIS NELLORE DISTRICT MLA IN PLACE OF LATE GOUTHAM REDDY NS

Mekapati Goutham Reddy: గౌతమ్ రెడ్డి స్థానంలో ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి? సీఎం జగన్ నిర్ణయం అదేనా?

సీఎం జగన్ తో మంత్రి మేకపాటి (పాత ఫొటో)

సీఎం జగన్ తో మంత్రి మేకపాటి (పాత ఫొటో)

మంత్రి గౌతమ్ రెడ్డి (Minister Goutham Reddy) గుండెపోటుకు గురై మరణించడంతో ఆయన స్థానంలో మరెవరిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారోన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ అంశంపై సీఎం జగన్ నిర్ణయం ఇలా ఉండే అవకాశం ఉంది.

    ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్ రెడ్డి ఇటీవల గుండెపోటుకు గురై మరణించిన విషయం తెలిసిందే. కేవలం 49 ఏళ్ల వయస్సులోనే ఆయన చనిపోవడం అందరినీ షాక్ కు గురి చేసింది. అత్యంత సౌమ్యుడిగా, వివాదాలకు దూరంగా ఉండే నేతగా పేరున్న గౌతమ్ రెడ్డి మృతికి పార్టీలకు అతీతంగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం జగన్ సైతం మంచి మిత్రుడిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన అంత్యక్రియలు ముగిశాయి. గౌతమ్ రెడ్డి సీఎం జగన్ మంత్రివర్గంలో అత్యంత కీలకమైన పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి, చేనేత జౌళి శాఖను నిర్వర్తించారు. ఆయన హఠాన్మరణంతో ఈ శాఖలు మరొకరికి అప్పగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సీఎం జగన్ ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశంపై ఏపీ రాజకీయల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొత్త వారిని ఎవరినైనా మంత్రి వర్గంలోకి తీసుకుంటారా? లేక సీఎం ఈ శాఖలను తనవద్దే ఉంచుకుంటారా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

    గౌతమ్ రెడ్డి మరణంతో జరగనున్న ఉప ఎన్నికల్లో ఆయన కుటుంబ సభ్యులకే పార్టీ నుంచి పోటీకి అవకాశం ఇస్తామని జగన్ ఇప్పటికే హామీ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఉప ఎన్నిక అనంతరం వారి కుటుంబీకులకే గౌతమ్ రెడ్డి ఇప్పటివరకు నిర్వహించిన శాఖల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పార్టీలో మరో చర్చ సాగుతోంది. అయితే కొత్త వారికి ఆ కీలకమైన శాఖలను అప్పగించవద్దని జగన్ భావిస్తే.. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఇందులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరు పేర్లు ముందు వరుసలో ఉన్నాయి.

    వీరిలో ఎవరినైనా మంత్రి వర్గంలోకి తీసుకుని గౌతమ్ రెడ్డి ఇప్పటివరకు నిర్వహించిన కొన్ని శాఖలను అప్పగింవచ్చని జిల్లాలో ప్రచారం సాగుతోంది.  సీఎం జగన్ తో ఉన్న సన్నిహిత్యం కారణంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే పక్కనే ఉన్న నెల్లూరు సిటీ స్థానానికి చెందిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికే మంత్రిగా ఉండడం కోటంరెడ్డికి ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అయితే.. సీఎం జగన్ మరికొన్ని రోజుల్లోనే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Ap cm jagan, Mekapati Goutham Reddy, Nellore Dist

    తదుపరి వార్తలు