గ్రామ సచివాలయాల్లో మరో కీలక అడుగు.. ఇక పెండింగ్ మాటే ఉండదు...

గ్రామ సచివాలయాల్లో ఖాళీలను సెప్టెంబరు లోగా భర్తీచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల మీద గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని.. సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ కూడా జరగాలని చెప్పారు.

news18-telugu
Updated: August 10, 2020, 5:04 PM IST
గ్రామ సచివాలయాల్లో మరో కీలక అడుగు.. ఇక పెండింగ్ మాటే ఉండదు...
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో మరో కీలక అడుగు పడింది. నిర్దేశిత సమయంలోగా వినతులు, దరఖాస్తుల అమలుపై పర్యవేక్షణ ఉండనుంది. ఇందుకోసం పర్సుయేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ యూనిట్‌ (PMU)ని ఏర్పాటు చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా PMUని సీఎం జగన్ ప్రారంభించారు. దరఖాస్తు ఎక్కడ ఆగినా సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం పీఎంయూ అప్రమత్తం చేస్తుంది. దాఖలైన దరఖాస్తులు యంత్రాంగంలోని వివిధ దశల్లో వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా వినతుల పరిష్కారంపై పర్యవేక్షిస్తుంది.

ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ ఆగినా సంబంధిత అధికారులకు, సిబ్బందికి అలర్ట్స్‌ పంపిస్తుంది.

దరఖాస్తు పెండింగులో ఉంటే ఉదయం డిజిటల్‌ మెసేజ్‌ చేస్తారు, మధ్యాహ్నం లోగా కూడా అది పరిష్కారం కాకపోతే నేరుగా సంబంధిత సిబ్బందికి పీఎంయూ కాల్ చేస్తుంది. పీఎంయూలో 200 మంది సిబ్బంది ఉంటారు. మొదటగా 4 సేవలపై ఈ పర్యవేక్షణ వ్యవస్థను తీసుకొచ్చారు. అక్టోబరు నుంచి 543కి పైగా సేవలపై పర్యవేక్షణ ఉంటుంది.

రైస్‌ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ కార్డు, ఇళ్ల స్థలాల పట్టాలకు సంబంధించి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఎవరు దరఖాస్తు చేసినా సరే దాన్ని నిరంతరం ఫాలో అప్‌ చేసి పరిష్కరించే లక్ష్యంతో ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. గ్రామ సచివాలయం ఉద్యోగి నుంచి ఎమ్మార్వో, ఎంపీడీఓ, చివరకు సెక్రటరీల స్థాయి వరకూ ఫాలోఅప్‌ జరుగుతుంది. 10 రోజుల్లో బియ్యం కార్డు, 10 రోజుల్లో పెన్షన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి స్థలం పట్టా కచ్చితంగా రావాలి.
సీఎం జగన్


ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాల్లోని సచివాలయాలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఫంక్షనల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులతో ఈ సచివాలయాలకు ఇంటర్నెట్‌ సదుపాయం కల్పిస్తున్నారు. ఇంటర్నెట్‌ లేని 512 సచివాలయాలను ఈ విధానం ద్వారా అనుసంధానం చేస్తున్నారు. మొదటగా 213 సచివాలయాలలకు ఫంక్షనల్‌ బ్రాడ్‌ బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసును ప్రారంభించారు.
మిగిలిన సచివాలయాలకు వచ్చే 2 నెలల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి మార్గదర్శకాలను బోర్డుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో టాయిలెట్లు ఉండాలని తెలిపారు. గ్రామ సచివాలయాల్లో ఖాళీలను సెప్టెంబరు లోగా భర్తీచేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ కార్యక్రమాల మీద గ్రామ సచివాలయ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వాలని.. సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ కూడా జరగాలని చెప్పారు. సచివాలయాల్లోని ఉద్యోగులకు, వాలంటీర్లకు ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.
Published by: Shiva Kumar Addula
First published: August 10, 2020, 5:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading