జగన్ మరో సంచలన నిర్ణయం... పేదలకు షాకే...

Amaravathi : పొదుపు అన్న ఒకే ఒక్క మంత్రాన్ని జపిస్తూ... ప్రతీ నిర్ణయాన్నీ దానికి అనుగుణంగా తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. అసలే నిధుల కొరత ఉండటంతో... ప్రతీ దాంట్లో కోతలు పెట్టుకుంటోంది. తాజాగా మరో కీలక నిర్ణయం ఆ కోణంలో తీసుకున్నదే.

news18-telugu
Updated: November 10, 2019, 6:56 AM IST
జగన్ మరో సంచలన నిర్ణయం... పేదలకు షాకే...
సీఎం జగన్
  • Share this:
Amaravathi : మీకు తెలుసు... గత టీడీపీ ప్రభుత్వం BPL (దారిద్ర్యరేఖకు దిగివన), APL (దారిద్ర్య రేఖకు ఎగువన) కుటుంబాలు... 500 చదరపు గజాల వరకూ అక్రమించుకున్న స్థలాల్ని క్రమబద్ధీకరించుకోమని ఛాన్స్ ఇచ్చింది. ఫలితంగా అప్పటికే ఎక్కడెక్కడో స్థలాల్ని ఆక్రమించుకున్న చాలా మంది... అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఛాన్స్ ఉపయోగించుకొని స్థలాల్ని క్రమబద్ధీకరించుకున్నారు. అదనపు స్థలాల్ని ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఐతే... ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ సర్కార్ నిర్ణయం నచ్చలేదు. ఒక్కో కుటుంబం 500 చదరపు గజాల్ని క్రమబద్ధీకరించుకోవడం కరెక్టు కాదని భావించింది. అందువల్ల తమ హయాంలో 300 చదరపు గజాల వరకు మాత్రమే క్రమబద్ధీకరణ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అదనంగా ఎంత స్థలం ఆక్రమిస్తే, అంతా ప్రభుత్వానికి ఇచ్చేయాల్సిందే. ఇదివరకు 500 చదరపు గజాల్ని క్రమబద్ధీకరించుకున్నవారిపై ఇప్పుడు ఎలాంటి ఎఫెక్టూ పడదు. కొత్తగా ఎవరైనా భూముల్ని ఆక్రమించుకొన ఉంటే... వాళ్లు ఈ రూల్ ప్రకారం... 300 చదరపు గజాల్ని మాత్రమే క్రమబద్ధీకరించుకొని మిగతాది ప్రభుత్వానికి ఇచ్చేయాలి. ఇది కొత్తగా స్థలాలు ఆక్రమించుకున్న పేదలకు షాకింగ్ నిర్ణయమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

కొత్త రూల్స్ ప్రకారం... మొదటి 100 చదరపు గజాల వరకూ గజానికి రూ.1 చెల్లించి క్రమబద్ధీకరించుకోవాలి. ఆపై 200 చదరపు గజాలకు... మార్కెట్ రేట్ ఆధారంగా కలెక్టర్ రేటు నిర్ణయిస్తారు. కలెక్టర్ చెప్పిన రేటు ప్రకారం... 200 చదరపు గజాలకు ప్రభుత్వానికి మనీ చెల్లించాల్సి ఉంటుంది.

క్రమబద్ధీకరణ ఎలా?
- క్రమబద్ధీకరించుకునే ఛాన్స్ అందరికీ లేదు.
- తప్పనిసరిగా తెల్ల రేషన్ కార్డు ఉండాల్సిందే. వాళ్లు మాత్రమే క్రమబద్ధీకరించుకోగలరు.
- తెల్లకార్డు లేకపోతే... ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని తహసీల్దార్ ద్వారా సెర్టిఫై చేయించుకోవాలి.
- ఇప్పటి నుంచీ 120 రోజుల్లో మీసేవ లేదా గ్రామ సచివాలయం ద్వారా క్రమబద్ధీకరణకు అప్లికేషన్ పెట్టుకోవాలి.- అప్లికేషన్‌ను తహసీల్దారు చెక్ చేస్తారు. అన్నీ కరెక్టుగా ఉంటే... ఓకే అంటారు.
- క్రమబద్ధీకరించుకున్నవాళ్లు ఐదేళ్లపాటూ... ఆ స్థలాల్ని అమ్ముకోవడానికి వీలు లేదు.
- క్రమబద్ధీకరణ డబ్బును ఆరు నెలల్లో చెల్లించవచ్చు.
- 6 నెలల్లో డబ్బు కట్టకపోతే... అప్పటివరకూ కట్టిన డబ్బును వెనక్కి ఇచ్చి... ఆక్రమించిన స్థలాన్ని ప్రభుత్వం తీసేసుకుంటుంది.
- ఎక్కడబడితే అక్కడ ఆక్రమించిన భూములకు క్రమబద్ధీకరణ ఉండదు. అందుకూ కొన్ని లెక్కలున్నాయ్.
- మాస్టర్-జోనల్-రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్‌లో ఉన్న భూముల్ని క్రమబద్ధీకరించరు.
- నదుల వరద మట్టం పరిధిలో ఉన్న భూములకు ఇది వర్తించదు.
- నీటి వనరులు ఉండే చోట స్థలాలు ఆక్రమిస్తే కుదరదు.
- ఖరీదైన భూములకు కూడా ఇది వర్తించదు.
- ఖరీదైన ప్రాంతాల్లో భూములు ఆక్రమించుకున్న లబ్దిదారులకు... వేరే ప్రాంతాల్లో భూములు కేటాయిస్తారు.

ఇదీ మేటర్. గత ప్రభుత్వంతో పోల్చితే... 200 చదరపు గజాలు తక్కువగా క్రమబద్ధీకరించాలని వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పేదలకు బాధ కలిగించేదే. ఐతే... ఇప్పుడున్న పరిస్థితులు, ఆర్థిక సమస్యలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకుంది వైసీపీ ప్రభుత్వం. దీనికి ప్రజలు సహకరించాలని కోరుతోంది.


Pics : బెంగాలీ రసగుల్ల మేఘా చౌదరీ క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :

అయోధ్యలో రామమందిరం ఎలా ఉంటుందో తెలుసా... ఇలా...

IND vs BAN : నేడు మూడో టీ20... గెలిస్తే సిరీస్ మనదే

అయోధ్య తీర్పు రాసిందెవరు?... తెలిస్తే షాక్ అవ్వరు

Health Tips : ధ్యానంలో ఏకాగ్రత పెరగాలా? ఈ తైలాలు వాడితే సరి...
Published by: Krishna Kumar N
First published: November 10, 2019, 6:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading