కేసీఆర్ బాటలో జగన్...ఏపీలోనూ కంటి వెలుగు పథకం

ప్రతీ ఒక్కరికీ మంచి కంటిచూపు ఉండాలనే ఉద్దేశంతో వైయస్ఆర్ కంటి 'వెలుగు వైఎస్సార్ కంటి వెలుగు' పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 10 నుంచి రాష్ట్రంలోని ప్రజలకు నేత్ర నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.

news18-telugu
Updated: August 13, 2019, 9:54 PM IST
కేసీఆర్ బాటలో జగన్...ఏపీలోనూ కంటి వెలుగు పథకం
కేసీఆర్‌తో భేటీ తర్వాత జగన్ మోహన్ రెడ్డి జెరూసలేం పర్యటనకు వెళ్లనున్నారు.
  • Share this:
తెలంగాణ ప్రజలకు కంటి చూపు సమస్యలు లేకుండా చేయడమే లక్ష్యంగా గత ఏడాది సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్రంలోని ప్రజలందరికీ ప్రభుత్వమే ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు పంపిణీ చేసింది. అవసరమైన వారికి శస్త్రచికిత్స కూడా చేశారు. రాష్ట్రంలో లక్షలాది మంది కంటి పరీక్షలు చేయించుకొని కళ్లద్దాలు వాడుతున్నారు. ఐతే ఏపీలోనూ ఈ కంటి వెలుగు పథకాన్ని తీసుకొస్తున్నారు సీఎం జగన్.

ప్రతీ ఒక్కరికీ మంచి కంటిచూపు ఉండాలనే ఉద్దేశంతో వైయస్ఆర్ కంటి 'వెలుగు వైఎస్సార్ కంటి వెలుగు' పథకానికి జగన్ శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 10 నుంచి రాష్ట్రంలోని ప్రజలకు నేత్ర నిపుణులు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహిస్తారు. దృష్టి లోపం ఉన్న వారికి కళ్లద్దాలను అందజేయడమే గాక..అవసరమైన వారికి ప్రభుత్వమే ఆపరేషన్లను చేయిస్తుంది.


First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు