AP CM JAGAN DELHI TOUR END THIS IS THE MAIN REASONS TO CM JAGAN INSIDE MEETING WITH PM MODI NGS GNT
CM Jagan: సీఎం జగన్ ఢిల్లీ టూర్ అసలు మ్యాటర్ ఇదే.. ప్రధాని ఏమన్నారంటే..?
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ఇదే కారణం
CM Jagan Delhi tour End: ఆంధప్రదేశ్ సీఎం జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. ముఖ్యంగా ప్రధాని మోదీతో గంటకు పైగా చర్చించారు.. ఇంతకీ బయట ప్రచారం జరుగుతున్నట్టు రాష్ట్రానికి నిధులు, పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు.. ఈ ఇద్దరి మధ్యం ఏఏ అంశాల ప్రధానంగా చర్చకు వచ్చాయి..?
CM Jagan Toru: రెండు రాజుల పాటు సీఎం జగన్ (CM Jagan) ఢిల్లీలో బిజీ బిజీగా అందర్నీ కలిశారు. రాష్ట్ర సమస్యలు.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ఏకరువు పెట్టారు. అయితే ప్రధానంగా ఆయన ఇతర కేంద్రమంత్రులతో ఏం చర్చించినా.. ప్రధాని మోదీ (PM Modi) మాత్రం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ సమస్యలతో పాటు రాజకీయ అంశాలపై చర్చించినట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఇటీవల విజయవాడ వేదికంగా ఏపీ బీజేపీ నేతలు ప్రజాగ్రహ సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన ఏపీ బీజేపీ నేతలతో పాటు, కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్న జాతీయ నేత ప్రకాష్ జవదేకర్ (Prakash Jawadekar)వ్యాఖ్యలను ప్రధానికి వివరించినట్టు సమాచారం. ఆ సభకు ముఖ్య అతిథిగా వచ్చిన జవదేకర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కీలక నేతలు బెయిల్ పై ఉన్నారని.. వారు ఎప్పుడైనా జైలుకు వెళ్తారంటూ.. పరోక్షంగా జగన్ ప్రస్తావన తెచ్చారన్నది బహిరంగ రహస్యం.. ఈ వ్యాఖ్యలే జగన్ ను ఢిల్లీకి వెళ్లేలా చేశాయన్నది పొలిటికల్ టాక్..
బీజేపీ కీలక జాతీయ నేత.. మోదీ టీంలో కీలకమైన సభ్యుడు ఈ వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఈ అంశాన్ని ప్రధాని మోదీకి దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ముందు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దృష్ట్యా రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలని ప్రధానిని కోరారు సీఎం జగన్. అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని కోరారు సీఎం జగన్. బీహార్ కి ప్రత్యేక హోదా పరిశీలన లో ఉందన్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ వ్యాఖ్యలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నిటితో పాటు ప్రధానంగా రాజకీయ అంశాలపైనే ప్రధానంగా మాట్లాడినట్టు తెలుస్తోంది.
ప్రతి విషయంలో కేంద్రానికి తమ ప్రభుత్వం మద్దతుగా నిలుస్తోందని.. మిత్రపక్షం కంటే సహాయ పడుతున్నామని.. అలాంటి తమ పార్టీని ఏపీ బీజేపీ నేతలు ఎందుకు పదే పదే టార్గెట్ చేయాల్సి వస్తోందో అర్థం కావడం లేదని అన్నట్టు తెలుస్తోంది. నిధుల విషయంలో బీజేపీ నేతలు పదే పదే మాట్లాడుతుండడం.. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఉందని వివరించినట్టు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైనా పొరపాటులు ఉంటే చర్చించుకుంటే సరిపోతుందని.. ఇలా టార్గెట్ చేసినట్టు మాట్లాడితే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే భావన ఉందని ప్రధానికి వివరించినట్టు బోగట్టా.. భవిష్యత్తులో ఒకరికి ఒకరు సహకరించుకునేలా రాజకీయం బంధం ఉండేలా చూడాలని కోరినట్టు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ చెప్పిన మాటలు విన్న ప్రధాని.. ఎలాంటి సమస్యలు రావని చెప్పినట్టు తెలుస్తోంది. మరి భవిష్యత్తులో ఏపీలో బీజేపీ -వైసీపీ మధ్య ఎలాంటి బంధం ఉంటుందో చూడాలి.. ప్రధానిని కలిసిన తరువాత బీజేపీ నేతల విమర్శలు తగ్గుతాయా.. లేదా ఎప్పటిలానే వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తారా అన్నది చూడాలి..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.