Andhra Pradesh: ఏపీలో వారికి ఏడాదికి రూ. 10 వేలు.. మరో కొత్త పథకం ప్రకటించిన సీఎం జగన్

Andhra Pradesh: ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. హస్తకళల ద్వారా ఉపాధి పొందుతున్న వారికి వరాలు ప్రకటించారు. హస్తకళల కళాకారులకు ఏటా రూ. 10 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.

news18-telugu
Updated: October 21, 2020, 5:29 PM IST
Andhra Pradesh: ఏపీలో వారికి ఏడాదికి రూ. 10 వేలు.. మరో కొత్త పథకం ప్రకటించిన సీఎం జగన్
ఏపీ సీఎం జగన్
  • Share this:
ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. హస్తకళల ద్వారా ఉపాధి పొందుతున్న వారికి వరాలు ప్రకటించారు. హస్తకళల కళాకారులకు ప్రతీ సంవత్సరం రూ. 10 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. చేనేత, హస్త కళల ఉత్పత్తులకు మరింతగా మెరుగ్గా మార్కెటింగ్‌ సదుపాయం కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆప్కో– లేపాక్షి ఆన్‌లైన్‌ పోర్టల్‌ను మంగళవారం సీఎం జగన్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన జీవితంలో అనేక రకాలుగా సేవలందిస్తున్న వివిధ వృత్తుల వారికి ప్రభుత్వం గౌరవం ఇస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే దేశ చరిత్రలోనే కనీవినీ ఎరగని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆ వర్గాల వారికి పదవులు ఇచ్చామని సీఎం గుర్తు చేశారు. ఒక వైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌కు అవకాశం కల్పిస్తూ.. మరోవైపు ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం వల్ల హస్త కళాకారులకు మంచి జరగాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు.

ప్రస్తుతం ప్రకటించిన రూ.10 వేల సాయాన్ని ఫిబ్రవరి తర్వాత అందిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఏపీలో ప్రాచుర్యం పొందిన కళలు, వృత్తులకు ఆప్కో ఆన్‌లైన్‌ స్టోర్, లేపాక్షి వెబ్‌ స్టోర్‌ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా మార్కెటింగ్‌ సదుపాయం లభిస్తుందని సీఎం అన్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర తదితర ఆన్లైన్ షాపింగ్ వెబ్ సైట్లలో సైతం చేనేత, హస్త కళల ఉత్పత్తులు అందుబాటులో ఇక నుంచి ఉండనున్నాయి. ఆయా సంస్థలతో లేపాక్షి, ఆప్కో సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి.

ఆప్కో ఆన్‌లైన్‌ స్టోర్‌ లో వెంకటగిరి, మాధవరం, బందరు, రాజమండ్రి, ఉప్పాడ, ధర్మవరం, చీరాల, మంగళగిరి, వెంకటగిరి తదితర చేనేత, పట్టు, కాటన్‌ చీరలు, వ్రస్తాలు, డ్రెస్‌ మెటీరియల్స్, బెడ్‌షీట్లను ఆర్డర్ చేసి పొందే అవకాశం కల్పించారు. లేపాక్షి వెబ్‌ స్టోర్‌ ద్వారా దుర్గి రాతి శిల్పాలు, బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులు, కొండపల్లి, ఏటికొప్పాక, పెడన, చిత్తూరు కలంకారీ ఉత్పత్తులు, శ్రీకాకుళంలో తయారయ్యే ఆదివాసీ పెయింటింగ్‌లు, ఉదయగిరి చెక్క కళాఖండాలు, ధర్మవరం తోలు బొమ్మలు, బొబ్బిలి వీణ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించారు. ఈ వెబ్ స్టోర్ల ద్వారా ఆయా కళాకారులకు మంచి గుర్తింపు రావడంతో పాటు ఆదాయం వచ్చే అవకాశం ఏర్పడింది.
Published by: Nikhil Kumar S
First published: October 21, 2020, 5:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading