ఎన్నికల వేళ పండగే పండగ... ఏపీ సర్కార్ భారీ సంక్రాంతి కానుక

Andhra Pradesh Pension | ఏపీలో భరోసా పింఛన్లను పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఏడాదికి రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ. 7 వేల కోట్ల వరకు భారం పడనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

news18-telugu
Updated: January 11, 2019, 6:29 PM IST
ఎన్నికల వేళ పండగే పండగ... ఏపీ సర్కార్ భారీ సంక్రాంతి కానుక
పింఛన్ల లబ్దిదారులు(ఫేస్ బుక్ ఇమేజ్)
news18-telugu
Updated: January 11, 2019, 6:29 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పింఛన్ పొందుతున్న లబ్దిదారులందరికీ... ప్రస్తుతం ఇస్తున్న మొత్తం కంటే రెట్టింపు మొత్తం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. పెంచిన పింఛన్లను జనవరి నుంచే అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఫిబ్రవరిలో ఇచ్చే పింఛన్లలోని జనవరికి సంబంధించిన పింఛన్ బకాయిలను కూడా చెల్లించనుంది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఏడాదికి రాష్ట్ర ఖజానాపై అదనంగా రూ. 7 వేల కోట్ల వరకు భారం పడనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పింఛన్ల కోసం నెలకు రూ. 560 కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 6720 కోట్లకు పైగా పింఛన్లకు కేటాయిస్తోంది.

తాజాగా పింఛన్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడంతో... ఇందుకోసం నెలకు రూ. 14 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏపీలో ప్రస్తుతం వివిధ రకాల పింఛన్లు అందుకునే వారి సంఖ్య 50, 61, 906గా ఉంది. వీరితో పాటు కొత్తగా మరో నాలుగున్నర లక్షల మంది పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీరిలో అర్హులను గుర్తించి... వారికి కూడా పెన్షన్ మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ కొత్త లబ్దిదారులకు కూడా పింఛన్లు మంజూరైతే... వీటి కోసం ఏపీ ప్రభుత్వం నెలకు 1200 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్ధికశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ లబ్దిదారులకు ముందే సంక్రాంతి పండగ వచ్చినట్టయ్యింది.

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...