పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల తల్లిదండ్రులకు చంద్రబాబు కీలక విజ్ఞప్తి

ఇటీవలి తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో.. మరోసారి అలాంటి పరిస్థితి పునరావృతం కావద్దని అంతా కోరుకుంటున్నారు.

news18-telugu
Updated: May 14, 2019, 4:02 AM IST
పదో తరగతి ఫలితాలు.. విద్యార్థుల తల్లిదండ్రులకు చంద్రబాబు కీలక విజ్ఞప్తి
చంద్రబాబునాయుడు (File)
  • Share this:
పరీక్షా ఫలితాలు వెలువడుతున్నాయంటే చాలు.. మునుపెన్నడూ లేని ఆందోళనకర వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఇటీవలి తెలంగాణ ఇంటర్ ఫలితాల అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో.. మరోసారి అలాంటి పరిస్థితి పునరావృతం కావద్దని అంతా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నేటి ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విద్యార్థుల తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి చేశారు.

మంగళవారం విడుదల కాబోయే ఫలితాల్లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా.. వారికి అండగా నిలబడాలని తల్లిదండ్రులకు చంద్రబాబు సూచించారు. వారిని నిందించడం, ఇతర పిల్లల ప్రతిభతో పోల్చి వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయవద్దన్నారు. పరీక్షల్లో ఫలితాలే తెలివి తేటలకు కొలమానం కాదని, కింద పడినా.. పైకి లేచే కెరటాల్లా రెట్టించిన ఉత్సాహంతో అద్భుత ఫలితాలు సాధించేలా వారిలో ప్రేరణ కలిగించాలని చెప్పారు.


నేటి ఫలితాల కోసం ఫలితాల కోసం విద్యాశాఖ పలు ఏర్పాట్లు చేసింది. వివిధ సైట్స్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలిపింది. ఆర్టీజీఎస్ వెబ్‌సైట్, పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్, ఖైజాలా యాప్, ఫైబర్ నెట్ టీవీ తెరపై కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని వెల్లడించింది. విద్యార్థులు ఆర్టీజీఎస్ వెబ్‌సైట్ www.rtgs.ap.gov.in, పీపుల్ ఫస్ట్ మొబైల్ యాప్ https://bit.ly/2E1cdN7, ఖైజాలా యాప్ https://aka.ms/apresult ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చని, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్) వెబ్‌సైట్‌ www.rtgs.ap.gov.inలో ముందుగా విద్యార్థి నెంబర్ టైప్ చేయగానే ఫలితాలు వస్తాయని తెలిపింది.


First published: May 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు