ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు-మమత భేటీ...45 నిమిషాల పాటు ఏం చర్చించారు?

ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మాపోరాట దీక్షను మమతా బెనర్జీ అభినందిచినట్లు సమాచారం. విపక్ష నేతలంతా సంఘీభావం తెలిపారని..ఇలాగే కలిసికట్టుగా ఉండి కేంద్రంపై పోరాటం చేద్దామని సూచించారు.

news18-telugu
Updated: February 12, 2019, 10:51 PM IST
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు-మమత భేటీ...45 నిమిషాల పాటు ఏం చర్చించారు?
మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: February 12, 2019, 10:51 PM IST
ఢిల్లీలో ఎయిర్‌పోర్టులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇద్దరు నేతల మధ్య సుమారు 45 నిమిషాల పాటు చర్చ జరిగింది. బీజేపీయేతర కూటమి ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మాపోరాట దీక్షను మమతా బెనర్జీ అభినందిచినట్లు సమాచారం. విపక్ష నేతలంతా సంఘీభావం తెలిపారని..ఇలాగే కలిసికట్టుగా ఉండి కేంద్రంపై పోరాటం చేద్దామని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఓటమే లక్ష్యంగా బీజేపీయేతర కూటమి ఏర్పాటుపైనా ఇద్దరు నేతలు సమాలోచనలు చేశారు.

మరోవైపు బుధవారం ఢిల్లీలో భారీ ఆందోళన కార్యక్రమాన్ని తలపెట్టారు సీఎం కేజ్రీవాల్. తానాషాహి హటావో..దేశ్ బచావో పేరుతో జంతర్ మంతర్‌లో ర్యాలీ జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, ఎన్సీ, ఎన్సీపీ, టీఎంసీ, టీడీపీ, డీఎంకే, జేడీఎస్, ఎస్పీ సహా పలు పార్టీలు మద్దతిస్తున్నాయి. కోల్‌కతాలో యునైటెడ్ నేషన్ కార్యక్రమానికి హాజరైన నేతలంతా ఇందులో పాల్గొననున్నారు. జంతర్ మంతర్ వేదికగా మరోసారి విపక్షాల ఐక్యతను చాటబోతున్నారు. ఈ క్రమంలో ఆమాద్మీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కోల్‌కతా నుంచి ఢిల్లీకి వచ్చారు మమతా బెనర్జీ. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడితో ఆమె సమావేశమై..పలు అంశాలపై చర్చించారు. అటు చంద్రబాబు సైతం ఢిల్లీలో ఆమాద్మీ తలపెట్టిన ర్యాలీలో పాల్గొననున్నారు.


First published: February 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...