రామోజీరావుతో చంద్రబాబు భేటీ... ఏం చర్చించారంటే...

AP Assembly Election 2019 : ఏపీ రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ప్రధాన పార్టీల నేతలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

Krishna Kumar N | news18-telugu
Updated: May 16, 2019, 5:44 AM IST
రామోజీరావుతో చంద్రబాబు భేటీ... ఏం చర్చించారంటే...
రామోజీ రావు, చంద్రబాబు (File Images)
  • Share this:
బుధవారం అమరావతి నుంచీ హైదరాబాద్ వచ్చి... రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి అమరావతి వెళ్లిపోయారు. ఇక్కడి వరకూ అంతా క్లారిటీగా ఉంది. ఐతే... చంద్రబాబు రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చినప్పుడు... ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుతో ప్రత్యేకంగా సమావేశం అయినట్లు తెలిసింది. వీళ్లిద్దరూ ఏం చర్చించుకున్నారు అన్న అంశంపై అధికారికంగా ఎలాంటి సమాచారమూ రాలేదు. ఐతే తెరవెనక ఏం జరిగిందన్నది మాత్రం అక్కడి వర్గాల నుంచీ తెలిసింది. ప్రధానంగా ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. టీడీపీకి అనుకూలంగా ప్రజల తీర్పు ఉంటే రాష్ట్రం, పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది. అదే వైసీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది..? రాష్ట్రానికి సంబంధించి జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. రాజధాని అమరావతికి సంబంధించి జగన్ ఆలోచన ఏంటి? వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు కాన్ఫిడెంట్‌గా రామోజీరావుకి చెప్పినట్లు తెలిసింది. ఐతే... సిటీలు, పట్టణాల్లో టీడీపీకి అనుకూలంగా ఉందనీ, పల్లెల్లో మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉందని రామోజీరావు చెప్పినట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిపై టీడీపీ మరింత ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని రామోజీరావు సూచించినట్లు సమాచారం. ఇదంతా ఆఫ్ ద రికార్డ్ మాత్రమే. వాళ్ల మధ్య ఏ చర్చ జరిగిందన్నదానిపై స్పష్టమైన సమాచారం మాత్రం బయటకు రాలేదు.

ఎన్నికల సమయంలో వీలైతే, చంద్రబాబు... రామోజీరావును కలవడం చాలా సందర్భాల్లో జరిగినదే. స్వర్గీయ ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించిన తర్వాత అప్పట్లోనే పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై చంద్రబాబు, రామోజీరావుతో చర్చించేవారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. పదేళ్లుగా డైరెక్టుగా కలిసే సందర్భాలు తగ్గినప్పటికీ... సత్సంబంధాలు మాత్రం కొనసాగుతున్నాయి.

First published: May 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>