ఏపీకి కొత్త గవర్నర్ వస్తున్నారా... ఇకపై సీఎం క్యాంప్ ఆఫీస్... రాజ్ భవన్

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌కి కొత్త గవర్నర్ ఉండాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడున్న గవర్నర్ నరసింహన్‌ స్థానంలో కొత్తవారు రాబోతున్నట్లు సమాచారం.

Krishna Kumar N | news18-telugu
Updated: June 24, 2019, 6:38 AM IST
ఏపీకి కొత్త గవర్నర్ వస్తున్నారా... ఇకపై సీఎం క్యాంప్ ఆఫీస్... రాజ్ భవన్
ప్రతీకాత్మక చిత్రం
Krishna Kumar N | news18-telugu
Updated: June 24, 2019, 6:38 AM IST
ఏపీకి కొత్త గవర్నర్ ఎప్పుడొస్తారన్నది కచ్చితంగా తెలియకపోయినా... త్వరలోనే వచ్చేయబోతున్నారన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న గవర్నర్ నరసింహన్‌కి తెలంగాణలోని హైదరాబాద్‌లో రాజ్ భవన్ ఉంది. ఏపీలో మాత్రం లేదు. అందువల్ల ఆయన ఏపీకి వచ్చినప్పుడల్లా... ప్రైవేట్ హోటల్స్‌లో స్టే చేస్తున్నారు. ఆయన రెండు రాష్ట్రాలకూ గవర్నర్ కాబట్టి... రాజ్ భవన్‌పై గత ఏపీ ప్రభుత్వం లైట్ తీసుకుంది. దాన్ని ఇష్యూ చేసి, రాజకీయ ప్రయోజనాలు పొందాలనే కుట్రపూరిత ఆలోచనలేవీ చెయ్యకుండా వదిలేసింది. ఐతే... కేంద్ర ప్రభుత్వం త్వరలోనే గవర్నర్ నరసింహన్‌కు భారం తగ్గిస్తూ... రెండు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త గవర్నర్లను నియమించబోతోందని తెలిసింది. అదే జరిగితే... ఏపీకి ప్రత్యేక రాజ్ భవన్ కావాల్సి ఉంటుంది. ఇప్పుడు దాని కోసమే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విజయవాడ MG రోడ్డులోని సీఎం క్యాంప్ ఆఫీస్‌ని రాజ్‌భవన్‌గా మార్చేస్తే ఎలా ఉంటుంది అన్న అంశాన్ని ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆల్రెడీ CRDA అధికారులు ఆ పనిలో ఉన్నారు. 2014లో సీఎం చంద్రబాబు పాలన మొదలుపెట్టినప్పుడు... విజయవాడలో ఇరిగేషన్ కార్యాలయాన్ని... క్యాంప్ ఆఫీస్‌గా మార్చుకున్నారు. అందుకోసం ఏకంగా రూ.40 కోట్లు ఖర్చుపెట్టారు. వెలగపూడిలో తాత్కాలిక సెక్రటేరియట్‌ను నిర్మించాక... అక్కడికి వెళ్లారు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక గవర్నర్ వస్తుండటంతో... వారి కోసం ఆఫీస్, ఇల్లు రెడీ చేస్తోంది ప్రభుత్వం.

ఖర్చులు తగ్గినట్లే : గవర్నర్ నరసింహన్ ఏపీకి వచ్చినప్పుడల్లా... ప్రభుత్వానికి బిల్లు పేలుతోంది. హోటల్ ఖర్చులు, ఇతరత్రా చాలా అవుతున్నాయి. జగన్ సీఎం పీఠం ఎక్కినప్పటి నుంచీ ఖర్చులు తగ్గించాలి, పొదుపు చెయ్యాలి... అని నేతలు, అధికారులందర్నీ కోరుతున్నారు. గవర్నర్ విషయంలోనూ ఈ పొదుపు మంత్రం ఫలించేలా చెయ్యాలనుకుంటున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ కాస్తా రాజ్‌భవన్‌గా మారితే, గవర్నర్‌ కోసం అయ్యే ఖర్చులు తగ్గుతాయి పైగా గవర్నర్‌కి కూడా ఓ భవనం ఇచ్చినట్లవుతుంది. ట్విస్ట్ ఏంటంటే... CM క్యాంప్ ఆఫీస్‌... రాజ్ భవన్ కోసం సరిపోదని... హైదరాబాద్ గవర్నర్ ఆఫీస్ తెలిపింది. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం తన నిర్ణయాన్నే అమలు చేయాలనుకుంటున్నట్లు తెలిసింది.

 ఇవి కూడా చదవండి :

బ్యాలెట్ వైపు రాహుల్ చూపు... అసెంబ్లీ ఎన్నికల్ని బహిష్కరిస్తారా?

ఏపీ పాలనలో స్పీడ్.. నేటి నుంచీ సీఎం జగన్ వరుస సమావేశాలు... ఇవీ కీలకాంశాలు
First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...