Home /News /andhra-pradesh /

AP CID OFFICIALS WENT TO MP RAGHURAMA KRISHNA RAJU RESIDENCE IN HYDERABAD TO SERVE NOTICE FULL DETAILS HERE PRN

Raghurama: రఘురామకు ఏపీ ప్రభుత్వం షాక్.. సంక్రాంతికి ఝలక్ ఇచ్చేందుకు సీఐడీ రెడీ

రఘురామకృష్ణంరాజు (ఫైల్)

రఘురామకృష్ణంరాజు (ఫైల్)

వైసీపీ (YCP) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (MP Raghurama KrishnamRaju) వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది. సంక్రాంతి పండగకి ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ (Hyderabad) లోని రఘురామ ఇంటికి వెళ్లారు.

    వైసీపీ (YCP) రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు (MP Raghurama Krishnam Raju) వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయింది. సంక్రాంతి పండగకి  ఎంపీ  వస్తున్నారని తెలిసి ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ (Hyderabad) లోని రఘురామ ఇంటికి వెళ్లారు. 2021లో నమోదైన కేసుకు సంబంధి ఈనెల 17న విచారణకు హాజరుకావాలని ఆయనకు నోటీసులిచ్చారు. ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమవుతోంది. మరి రఘురామ విచారణకు వెళ్తారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది. సంక్రాంతికి భీమవరం వెళ్లేందుకు రఘురామ నేడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు ముందుగానే గచ్చిబౌలిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు.

    ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఏపీ సీఐడీ అధికారులు గత ఏడాది మే 14న హైదరాబాద్ లోని నివాసంలో రఘురామను అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అనంతరం ఆయన్ను నాటకీయ పరిణామాల మధ్య హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆయనపై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేశారు. రఘురామకృష్ణం రాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ అందులో A1గా రఘురామకృష్ణంరాజు, A2గా టీవీ5, A3గా ఏబీఎన్‌ ఛానళ్లను పేర్కొన్నాయి.

    ఇది చదవండి: పొత్తుపై పవన్ కీలక వ్యాఖ్యలు.. 2024లో ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తామన్న జనసేనాని


    సిఐడి డిఐజీ ఎంక్వైరీ రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేశారు. రఘురామ కృష్ణంరాజుపై అభియోగాలను ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చిన సిఐడి.. ప్రభుత్వంపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రఘురామ వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా రఘురామ వ్యాఖ్యలున్నాయని.. అలాంటి వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టారని సీఐడీ స్పష్టం చేసింది. అలాగే కుల, మత, వర్గాలను టార్గెట్‌ చేసుకుని రఘురామ కృష్ణంరాజు వ్యవహరించారని పేర్కొంది.

    ఇది చదవండి: 2014 సీన్ 2024లో రిపీట్ కాబోతోందా..? ఏపీలో ఆ పార్టీకి అదే మైనస్ అవుతుందా..?


    TV5, ABN ఛానళ్లతో కలిసి ప్రభుత్వంపై రఘురామ కుట్ర చేసినట్టు పేర్కొన్న సీఐడీ.. ఆయన కోసం ప్రత్యేక స్లాట్లు కేటాయించారని ఆరోపించింది. రఘురామ కృష్ణంరాజుతో కలిసి ప్రభుత్వం టీవీ ఛానళ్ల విషం చిమ్మాయని... అలాగ పక్కా పథకం ప్రకారమే రఘురామ కృష్ణంరాజు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారని అభియోగాలు చేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రఘురామ రాజు కుట్ర చేశారని పేర్కొంది.

    ఇది చదవండి: ఆ పదాన్ని సరిగ్గా పలికితే తప్పుకుంటా.. సీఎంకు రఘురామ సవాల్..! సంక్రాంతి వస్తానన్న రాజుగారు


    దాదాపు రెండేళ్ల తర్వాత రఘురామ కృష్ణంరాజు తాను గెలిచిన నరసాపురం నియోజకవర్గానికి రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈనెల 13న ఉదయం భీమవరం వస్తున్నానని.. మూడు రోజుల పాటు అక్కడే ఉంటానని తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకుంటానని స్పష్టం చేశారు. అంతేకాదు తన ప్రతి కదలికను వీడియో తీసేందుకు ప్రత్యేకం బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఈనేపథ్యంలో ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ వెళ్ళడంతో ఉత్కంఠ నెలకొంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, MP raghurama krishnam raju

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు