తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు.
విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో.. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (cm jagan) తాడేపల్లిలో (tadepalli) జరిగిన సంక్రాంతి సంబరాల్లో (Sankranti Celebrations) పాల్గొన్నారు. సంప్రదాయ పంచెకట్టుతో తెలుగుతనం ఉట్టిపడేలా జగన్ వస్త్రధారణ ఉండటం విశేషం. అంతేకాదు.. ముఖ్యమంత్రి జగన్ ఆయన సతీమణి భారతితో కలిసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం నివాసం వద్ద గోశాలలో సంప్రదాయబద్ధంగా భోగి వేడుకలు జరిగాయి.
ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మన సంస్కృతి సంప్రదాయాలకు, సొంత గ్రామాలపై మమకారానికి, వ్యవసాయానికి, రైతులకు మనమంతా ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. భోగి మంటలు, రంగవల్లులు, పండుగ తెచ్చే సంబరాలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు’ అని సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇదిలా ఉండగా.. ‘అఖండ’ సినిమా విజయంతో ‘అన్స్టాపబుల్’ జోష్లో ఉన్న సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారంచేడులో భోగి జరుపుకున్నారు. ఆయనతో పాటు కుటుంబమంతా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరితో కలిసి భోగి మంటల వద్ద ముచ్చటించుకుంటున్న ఫొటో వైరల్గా మారింది.
ఇక.. వైసీపీ ముఖ్య నేత, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. సత్తెనపల్లిలో భోగి మంటల వద్ద లంబాడీ మహిళలతో కలిసి ఆయన డ్యాన్స్ చేశారు. ఈ వీడియో కూడా నెట్లో వైరల్గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.