హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet Decisions: ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు... త్వరలో కొత్త పథకానికి శ్రీకారం..

AP Cabinet Decisions: ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు... త్వరలో కొత్త పథకానికి శ్రీకారం..

ప్రతికాత్మకచిత్రం

ప్రతికాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మంత్రివర్గం (AP Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యల, ఓటీఎస్, పీఆర్సీ, ఈబీసీ నేస్తం పథకాలపై ప్రధానంగా చర్చించింది.

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మంత్రివర్గం (AP Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని (Minister Perni Nani) వెల్లడించారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై ప్రధానంగా చర్చించిన మంత్రివర్గం.. ఆస్పత్రుల్లో ఏర్పాట్లపై చర్చింది. కొవిడ్ సేవల కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను నియమించాలని తీర్మానించింది.  జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లలో 10 శాతం ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపుకు ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్డీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన అగ్రవర్ణ పద మహిళలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లలో రూ.45 వేలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద 3లక్షల మందికిపైగా అర్హులకు లబ్ధి చేకూరుస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ నెల 25న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తామన్నారు.

రాష్ట్రంలో 16 మెడికల్ కాలేజీల నిర్మాణం కోసం రూ.7850 కోట్లు, ఇప్పటికే అందుబాటులో ఉన్న మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రిల్లో 3820 కోట్లతో అభివృద్ధికి పనులకు పరిపాలనా అనుమతులపై కేబినెట్ ఆమోదముద్రవేసింది. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60ఏళ్ల నుంచి 62ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే 11వ పీఆర్సీని కూడా ఆమోదించింది.

ఇది చదవండి: “నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా..” క్యాసినో ఆరోపణలపై మంత్రి కొడాలి నాని సవాల్..


ఇక పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలతో ఐదురుతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఇందులో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మకు చోటు కల్పించింది. అలాగే మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వివరించారు.

ఇది చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ.. ఆ బస్సుల్లో 20శాతం డిస్కౌంట్..


వ్యవసాయంపైనా కేబినెట్లో సమీక్ష జరిపామన్నారు మంత్రి పేర్ని నాని. ఇక ధాన్యం కొనుగోళ్లకు సంబంధి 21 రోజుల్లో చెల్లింపులు జరుపుతున్నామన్నారు. ఇప్పటివరకు రూ కోట్లు చెల్లించినట్లు పేర్ని నాని తెలిపారు. ఏపీ ఉద్యాన శాఖ బెస్ట్ హార్టికల్చర్ స్టేట్ అవార్డ్ దక్కించుకున్నట్లు తెలిపారు. కిడాంబిశ్రీకాంత్ కు అకాడమీకి తిరుపతిలో 5 ఎకరాలు కేటాయిచినట్లు తెలిపారు. ఇదిలా ఉండే కడప నుంచి విజయవాడ, చెన్నైకు విమానాలు నడిపేందుకు ఇండిగో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు  మంత్రి వెల్లడించారు. గతంలో ట్రూజెట్ సంస్థ విమానాలు నడపగా ఆ సంస్థ ఆసక్తి చూపకపోవడంతో కొత్త సంస్థకు అప్పగించామన్నారు. ఓటీఎస్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటీఎస్ మొత్తాన్ని వాయిదా పద్ధతుల్లో చెల్లించేందుకు అనుమతివ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP cabinet

ఉత్తమ కథలు