news18-telugu
Updated: November 27, 2020, 4:35 PM IST
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ సీఎం (File)
Andhra Pradesh Cabinet Meeting Latest News: ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపికబురు అందించారు. పెన్షనర్లు, ఉద్యోగుల డీఏల (DA to Employees and Pensioners) చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెన్షనర్లకు 3.144 శాతం పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూలై 2018 నుంచి వర్తించనుంది. దీన్ని జనవరి –2021 నుంచి చెల్లించనున్నారు. జనవరి, 2019 నుంచి మరో 3.144శాతం డీఏ పెంపు వర్తింపు, 2021 జులై నుంచి చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై 2019 నుంచి మరో 5.24 శాతం డీఏ పెంపు, జనవరి 2022 నుంచి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు జులై 2018 నుంచి 3.144 శాతం డీఏ పెంపు, దీన్ని 2021 జనవరి నుంచి చెల్లిస్తారు. జనవరి, 2019 నుంచి 3.144శాతం పెంచిన డీఏను జులై 2021 నుంచి చెల్లిస్తారు. జూలై 2019 నుంచి పెంచిన 5.24శాతం డీఏను జనవరి 2022 నుంచి చెల్లించాలని కేబినెట్లో నిర్ణయించారు. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలన్నీ పూర్తిగా చెల్లించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ సమయంలో జీతాలు, పింఛన్లలో కోత విధించిన విషయం తెలిసిందే. ఈ బకాయిలను డిసెంబర్, జనవరి నెలలో చెల్లించాలని కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు.
సుప్రీంకోర్టులో జగన్‌కు డబుల్ బొనాంజా.. మరో గుడ్ న్యూస్వైఎస్ షర్మిలతో వైసీపీ ఎమ్మెల్యే రోజా... ఏం జరుగుతోంది?
మోదీ, జగన్ ‘ట్రెండ్ సెట్టర్స్’.. సోషల్ మీడియాలో దుమ్మురేపిన లీడర్స్.. ర్యాంక్స్ ఎంతంటే
ఏపీ కేబినెట్ నిర్ణయాలు
- నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయి సహాయ శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 చొప్పున ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో అధికారులకు సీఎం జగన్ ఆదేశం
- డిసెంబర్ 15 కల్లా పంట నష్టాన్ని నిర్ధారించాలి. డిసెంబర్ 30 నాటికి బాధితులకు పరిహారం అందించాలి.
- డిసెంబర్ 25న నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు ప్రారంభం. 30.6 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇవ్వనున్న ప్రభుత్వం. 28.3 లక్షలమందికి ఇళ్లుకూడా కట్టించి ఇవ్వనుంది.
- 11 వేల పంచాయితీల్లో 17,500 లే అవుట్లలో ఇళ్ల స్ధలాలు
- వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షణ పథకం కింద సమగ్ర సర్వే, డిసెంబర్ 21 నుంచి సర్వే ప్రారంభం
- ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్శిటీ చట్టం–2020 కోసం ఉద్దేశించిన బిల్లుకు కేబినెట్ ఆమోదం
- అనంతపురం జిల్లా పెనుకొండలో గొర్రెల పెంపకం కేంద్రంలో శిక్షణ కేంద్రంగా మార్చడానికి కేబినెట్ ఆమోదం
- రూ.25వేల కోట్లతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కేబినెట్ ఆమోదం
- వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తి ‘‘వైఎస్ఆర్ – జగనన్న’’ మెగా ఇండస్ట్రియల్ హబ్ ( వైజేఎంఐహెచ్)కు రాయితీలకు కేబినెట్ ఆమోదం
- ఆంధ్రప్రదేశ్ పల్నాడు ఏరియా కరువు నివారణ ప్రాజెక్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ( ఏపీ పీఏడీఎంపీసీఎల్) పేరిట ఎస్పీవీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (యూఐపీడీసీఎల్) పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు రిజిస్ట్రేషన్‌కు కేబినెట్ ఆమోదం
- ఏపీ గేమింగ్ యాక్ట్ –1974 ను సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్ ప్రకారం బిల్లును రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం. ఆన్లైన్ జూదం, గేమింగ్‌లపై ఉక్కుపాదం.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
November 27, 2020, 4:22 PM IST