ఏపీలో పేదల ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు... కొత్త కండిషన్...

ఏపీలో పేదల ఇళ్ల స్థలాల జీవోలో మార్పులు... కొత్త కండిషన్...

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు అర్హులైన 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్‌లో జూలై 8న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు పథకం కింద వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు అర్హులైన 27 లక్షల మందికి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నారు. ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన వారికి ఆగస్ట్ 14న ఇళ్లు నిర్మించడానికి శంకుస్థాపన కార్యక్రమం భారీ ఎత్తున చేపట్టనున్నారు. హోసింగ్ స్కీం కోసం మొత్తం 42,920 భూములు అవసరం అవుతున్నాయి. 25,842 ఎకరాలు ప్రభుత్వ, 16,078 ఎకరాలు ప్రైవేటు భూములు వినియోగించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 16 వేల వైఎస్ఆర్ జగనన్న కాలనీలు లే ఔట్స్ వేశారు. 2023 నాటికి రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చెయ్యాలని సీఎం జగన్ టార్గెట్ పెట్టుకున్నారు. అయితే, కేటాయించిన ఇళ్ల స్థలాలను విక్రయంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం జీవో 99లో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మంత్రి పేర్ని నాని తెలిపారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన ఖాళీ స్థలాన్ని లబ్దిదారులు విక్రయించడానికి వీల్లేదు. ప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇచ్చిన తర్వాత లబ్ధిదారులు ఆ ఇంట్లో కనీసం ఐదేళ్లు నివసించిన తర్వాత మాత్రమే దాన్ని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కండిషన్ల మీద ఆధారపడి ఉంటుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: