AP Cabinet Meet: సీఎం జగన్ అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ.. చర్చకు రానున్న కీలక అంశాలివే..

సీఎం జగన్ (ఫైల్ ఫొటో)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప‌లు కీల‌క అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

  • Share this:
    అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప‌లు కీల‌క అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మ‌కాల‌కు సంబంధించిన ఆర్డినెన్స్‌కు ఈ సమావేశంలో అమోదం తెలపనున్నట్లు తెలిసింది. సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్ట స‌వ‌ర‌ణకు సంబంధించిన అర్డినెన్స్‌కు కూడా మంత్రివర్గం ఆమోదం తెల‌ప‌నున్నట్లు సమాచారం.

    వ‌చ్చే నెల‌లో అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న నేపథ్యంలో.. అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణపై ఈ భేటీలో చర్చించనున్నారు. టీటీడీలో ప్ర‌త్యేక అహ్వానితుల నియామ‌కంపై చ‌ర్చ‌ జరగనుంది. ప్ర‌త్యేక ఆహ్వానితుల కోసం చ‌ట్ట‌ స‌వ‌ర‌ణ‌, దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయ శాఖ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ‌, దేవాదాయ శాఖలో విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ ఏర్పాటుపై కేబినెట్ చర్చించనుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఓ శాఖ ఏర్పాటు అంశం కూడా సీఎం, మంత్రుల మధ్య చర్చకు రానున్నట్లు సమాచారం.

    ఇది కూడా చదవండి: Love Marriage: పెద్దలు ఒప్పుకోకపోవడంతో అన్నవరంలో ప్రేమ పెళ్లి.. కానీ దురదృష్టం ఏంటంటే...

    విశాఖ శ్రీశారదా పీఠానికి భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. నూజివీడులో కేంద్రీయ కార్యాలయం ఏర్పాటుపై కేంద్రానికి సిఫారసు చేస్తూ తీర్మానం చేయనుంది. కడప జిల్లాలో లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాల్లో చెరువులను నింపే ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. గుట్కాపై నిషేధం విధిస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే మెడికల్ కాలేజీలకూ ఆర్థిక సాయంపై కూడా కేబినెట్ చర్చించనుంది. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడులో వైసీపీ కార్యాలయం కోసం ఒక ఎకరం 50 సెంట్లు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేయనుంది. ఏపీలో జైనులు, సిక్కుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
    Published by:Sambasiva Reddy
    First published: