AP CABINET MEET DEPENDS ON CENTRAL ELECTION COMMISSION PERMISSION MK
ఏపీ కేబినేట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ...కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే భేటీ ?
సీఎంతో భేటీ అయిన ఏపీ సీఎస్
నిబంధనల ప్రకారం అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప కేబినేట్ నిర్వహణకు అనుమతి దక్కడం అనుమానమే. దీంతో ఇప్పటికే తప్పనిసరిగా చర్చించాల్సిన అంశాలైన తాగునీటి సమస్య, ఫణి తుఫాను సహాయ చర్యలు, కరువు పరిస్థితులపై చర్చించేలా సీఎం చంద్రబాబు నోట్ తయారు చేయించారు.
ఈ నెల 10న ఏపీ కేబినేట్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎంవో కార్యాలయం సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నోట్ పంపండంతో ఒక్కసారిగా ఉత్కంఠ మొదలైంది. కేంద్ర ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణం ఏం చేయాలనే విషయంతో పలువురు అధికారులతో చర్చలు జరుపుతున్నారు. అంతేకాదు సీఎస్ ఎల్వీ తో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది సైతం భేటీ అవ్వడంతో ఈ చర్చకు ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా చీఫ్ సెక్రటరీతో కేబినేట్ భేటీ విషయమై సీఎం ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, జీఏడీ పొలిటికల్ సెక్రెటరీ శ్రీకాంత్ తో చర్చలు జరిపారు. సాధారణంగా కేబినేట్ భేటీ జరగాలంటే సీఎంవో నుంచి సీఎస్‌కు నోట్ వెళుతుంది. అక్కడి నుంచి సంబంధిత శాఖలకు నోట్ పంపించి, అజెండా తయారు చేస్తారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అజెండాలో ఉన్న అంశాలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి.
ఎందుకుంటే ప్రభుత్వ శాఖలన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వచ్చేస్తాయి. అజెండాలోని అంశాలకు ఈసీఐ అనుమతి ఇస్తే తప్ప... కేబినేట్ నిర్వహణకు అవకాశం ఉండదు. అయితే నిబంధనల ప్రకారం అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప కేబినేట్ నిర్వహణకు అనుమతి దక్కడం అనుమానమే. దీంతో ఇప్పటికే తప్పనిసరిగా చర్చించాల్సిన అంశాలైన తాగునీటి సమస్య, ఫణి తుఫాను సహాయ చర్యలు, కరువు పరిస్థితులపై చర్చించేలా సీఎం చంద్రబాబు నోట్ తయారు చేయించారు. దీంతో అజెండాలోని అంశాలను కేంద్ర ఎన్నికల సంఘానికి తెలియజేసే అవకాశం ఉంది. అయితే ఈసీఐ కు 48 గంటలు ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంది. మరోవైపు కేబినేట్ సమావేశంపై రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపైనే కేబినేట్ సమావేశం నిర్వహణ ఆధారపడి ఉంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.