హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Cabinet: డైలామాలో జ‌గ‌న్? కేబినేట్ విస్త‌ర‌ణ మూహుర్తం డేట్ పై భిన్నఅభిప్రాయాలు? ఎటూ తేల్చుకోలేక‌పోతున్న జ‌గ‌న్

AP Cabinet: డైలామాలో జ‌గ‌న్? కేబినేట్ విస్త‌ర‌ణ మూహుర్తం డేట్ పై భిన్నఅభిప్రాయాలు? ఎటూ తేల్చుకోలేక‌పోతున్న జ‌గ‌న్

ఏపీ కేబినెట్ (ఫైల్)

ఏపీ కేబినెట్ (ఫైల్)

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడుతోంది. కానీ ఈ టైంలో సీఎం జగన్ డైలమాలో పడ్డారా..? ఆ ముహూర్తంపై భిన్న వాదనలు ఎందుకు ఉన్నాయి. మంత్రుల మాటేంటి.?. అసలు సీఎం జగన్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు.

M BalaKrishna, Hyderabad, News18.

AP Cabinet:  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఏపీ కేబినేట్ (AP Cabinet) విస్త‌ర‌ణ రోజు రానే వ‌చ్చేసింది. మరో ఐదు రోజుల్లో కొత్త కేబినెట్ కొలువు తీరేందుకు సిద్ధమవుతోంది. అయితే  ఈ నెల 11 తేదిన 11 నిముషాల‌కు కేబినేట్ విస్త‌ర‌ణ చేయాల‌ని జ‌గ‌న్ భావించారు.  శార‌ధాపీఠం స్వ‌రూప‌నందేంద్ర స్వామి (Swarupanandendra Swamy) కూడా  11 తేది 11 నిముషాల‌కు కేబినేట్ విస్త‌ర‌ణ చేస్తే బాగుంటుంద‌ని సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) కు చెప్పొనట్టు సమాచారం. ఇప్పుడు ఈ ముహూర్తం పైనే వివాదం మొదలైంది. దీనిపై  భిన్న అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి. 11 తేది 11 నిముషాల‌కు అనే దాని కంటే ఈ నెల ఏడో తేది మంచి రోజుని ఆరోజు జ‌గ‌న్ కేబినేట్ విస్త‌ర‌ణ చేసుకుంటే తిరుగుండ‌ద‌ని కొంద‌రు పండితులు సలహా ఇస్తున్నారు.  ఈ నేపథ్యంలో  కేబినేట్  విస్త‌ర‌ణ‌కు స‌ర్వం సిద్ధం చేసుకున్న జ‌గ‌న్ అండ్ కోం ఇప్పుడు డైలమాలో ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది.  నమ్మిన స్వామీజీ చెప్పినట్టు మరి 11వ తేదీన విస్తరించాలా..? లకే  ముందుగా ఏడో తేదీనికి ఏర్పాట్లు చేసుకోవడం బెటరా అని ఆలోచిస్తున్నట్టు టాక్.

మ‌రో వైపు ఇప్పుటికే కేబినేట్ లో మార్పు చేర్పుల‌కు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు జ‌గ‌న్. దాదాపు 6 నెలల పాటు క‌స‌రత్తు కూడా చేశారు. ఆ త‌రువాతే త‌న కొత్త కేబినేట్ నుంచి ఎవ‌రు బ‌య‌ట‌కి వెళ్లాలి ఎవ‌రు లోప‌లికి రావాలి అనేదానిపై జ‌గ‌న్ ఒక జాబితాను త‌యారు చేసుకున్నారు. ఈ లిస్ట్ ప్ర‌కారం దాదాపు పాత కేబినేట్ లో ఒక‌రు లేదా ఇద్ద‌రు మిన‌హా పెద్ద‌గా ఎవ‌రు పాత మంత్రులు కొన‌సాగ‌ర‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న‌స‌మాచారం ప్ర‌కారం ఇద్ద‌రు మంత్రులే మాత్ర‌మే పాత కేబినేట్ నుంచి కొత్త కేబినేట్ లో కొన‌సాగుతారని తెలుస్తోంది.

ఇదీ చదవండి : ప్రధాని సహా, కేంద్రమంత్రులతో సీఎం జగన్ వరుస భేటీలు.. ఆయన ఏం చెప్పారంటే..?

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి  మంత్రులుగా ఉన్న‌సీనియ‌ర్ లీడ‌ర్స్ బొత్స‌, బాలినేని, వంటి నేత‌ల‌ను కూడా జ‌గ‌న్ కేబినేట్ నుంచి త‌ప్పిస్తోన్న‌ట్లు స‌మాచారం. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితం బాలినేని నేరుగా జ‌గ‌న్ ను క‌లిసి త‌న‌ను కేబినేట్ లో కొనసాగించ‌మ‌ని అడిగిన‌ట్లు స‌మాచారం. అందుకు జ‌గ‌న్ స‌ముఖత వ్య‌క్తం చేయ‌న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న సొంత బంధువు ప‌ట్లే జ‌గ‌న్ అలా వ్య‌వ‌హారించిన‌ప్పుడు తాము వెళ్లి అడిగినా ప్ర‌యోజ‌నం ఉండ‌దని.. అంతా ఫిక్స్ అయినట్టు టాక్.

ఇదీ చదవండి: టీడీపీ యువ ఎంపీతో ప్రధాని ముచ్చట్లు.. కూతురుకి చాక్లెట్లు ఇచ్చిన మోదీ సర్ ప్రైజ్

ఇదిలా ఉంటే ఇప్పుడు కేబినేట్ విస్త‌ర‌ణ 11 లేదా 7 తేదిన అనేదానిపై చాలా ఉత్కంఠ నెల‌కుంది. పార్టీలో కొంద‌రు 7 తేది అంటే మ‌రి కొంద‌రు లేదు స్వ‌రుపానంద పెట్టిన మూహుర్త‌నికే జ‌గ‌న్ కేబినేట్ విస్త‌రిస్తార‌ని అంటున్నారు. దీంతో పాటు స్వ‌రూపానంద పెట్టిన మూహుర్తంపై ఇటు పండిత వ‌ర్గాల్లో కూడా బిన్న అభిప్రాయాలు వ‌క్త‌మవుతుండ‌డంతో కాస్త డైలామాలో ఉంది జ‌గ‌న్ అండ్ కోం. ఏది ఏమైనా మ‌రో రెండు రోజుల్లో దినికి సంబంధించి ఫుల్ క్లారిటీ రానున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: విశాఖలో భూముల కబ్జా ఆరోపణలకు కారణం ఆయనే..? మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

అయితే మంత్రి పేర్ని నాని తాజాగా మాట్లాడుతూ 11వ తేదీనే విస్తరణ ఉంటుందని స్పష్టత  ఇచ్చారు. మరోవైపు ఏడో తేదీని కేబినెట్ భేటీ నిర్వహించి.. అప్పుడే ఎవర్ని తప్పిస్తున్నాను అన్నదానిపై జగన్ క్లారిటీ ఇస్తారని.. ఆ వెంటనే వారి నుంచి రాజీనామాలు చేయిస్తారు.. ఆ తరువాత రోజు అంటే ఏప్రిల్ 8న గవర్నర్ అపాయింట్ మెంట్ కూడా కోరారు. అదే రోజు గవర్నర్ తో భేటీ అయ్యి.. కొత్త మంత్రి వర్గ జాబితా ఆయనకు చూపిస్తారని ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఏడో తేదీని విస్తరణ లేనట్టే అని వైసీపీ నేతలు అంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP cabinet, Ap cm jagan

ఉత్తమ కథలు