కాస్త నవ్వండన్నా... మంత్రులతో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు...

AP Cabinet : అవినీతిని సహించేది లేదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ కేబినెట్ సమావేశంలో కలకలం రేపాయా?

Krishna Kumar N | news18-telugu
Updated: June 11, 2019, 9:39 AM IST
కాస్త నవ్వండన్నా... మంత్రులతో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు...
సీఎం వైఎస్ జగన్
  • Share this:
వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ అవినీతి అంశంపై ఘాటుగానే మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా, పార్టీ నేతలతో చర్చలు జరిపినా, ప్రతిసారీ అవినీతిపై పోరాడాలి, అవినీతి జరగకూడదు, దేశానికే ఆదర్శంగా ఉండాలి అంటూ... స్పీచ్ ఇస్తున్నారు. తాజాగా కేబినెట్ సమావేశంలో మరింత ఘాటుగా స్పందించారు. అవినీతి మచ్చ పడితే... మంత్రులైనా సరే బర్తరఫ్ చేస్తాననీ, అవినీతిపై పోరాడేవాళ్లకు బహుమతులు ఇస్తానని ప్రకటించారు. అవినీతి మకిలి అంటిన మంత్రికి రెండున్నర ఏళ్లు దాటకుండానే పదవి పోతుందన్న జగన్ వ్యాఖ్యలు... కేబినెట్‌లో మంత్రులకు దాదాపు షాక్ ఇచ్చినంత పనైందట. ఏ ప్రతిపక్షాలో తమపై అవినీతి బురద చల్లితే... నిజానిజాలు తేలకుండానే తమ పదవులు పోతాయేమోనన్న ఆందోళన మంత్రుల్లో వ్యక్తమైందనీ... అందువల్ల మంత్రులంతా ముఖాలపై నవ్వు అన్నదే లేకుండా సీరియస్‌ ఫేసులతో ఉన్నారని తెలిసింది. ఆ సమయంలో వారు అలా ఉండటం నచ్చని జగన్... "కాస్త నవ్వండన్నా, నవ్వండమ్మా" అని అనడంతో... ఒక్కసారిగా అందరూ సీరియస్ ఫేసుల నుంచీ నార్మల్ లుక్ లోకి వచ్చారని తెలిసింది.

అవినీతి విషయంలో రాజీ ప్రసక్తే లేదన్న జగన్... అధికారులు ఎవరైనా సరే... మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు తీసుకోకూడదనీ, రెండువైపులా కలిసి పనిచేసి, చక్కటి ఫలితాలు రాబట్టాలని సూచించారు. అధికారుల సలహాల్ని తీసుకుంటూ, మెరుగైన పాలన అందించేందుకు మంత్రులు ప్రయత్నించాలని కూడా కోరారు జగన్. మంత్రిత్వ శాఖలు చేపట్టిన పనిని, అవి ఎంతవరకూ పూర్తైందీ, ఏ దశలో ఉన్నదీ ఎప్పటికప్పుడు ఆయా శాఖల వెబ్ సైట్లలో ఉంచాలని జగన్ అధికారులను ఆదేశించారు.

 

ఇవి కూడా చదవండి :

న్యూయార్క్ మాన్‌హట్టన్ భవనంపై హెలికాప్టర్ ప్రమాదం... పైలట్ మృతి

మీసాలు ట్రిమ్... షర్టులు టక్... ఉద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా కండీషన్లు...

హైకోర్టుకు చేరిన సీఎల్పీ విలీన వివాదం... నేడు విచారణ... చట్టం ఏం చెబుతుంది..?అన్ని సబ్జెక్టుల్లోనూ 35 మార్కులే... ఇలా పాసైన స్టూడెంట్ ఇతనొక్కడేనేమో..?
First published: June 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading