Home /News /andhra-pradesh /

AP CABINET APPROVES FINAL NOTIFICATION OF NEW DISTRICTS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తి.. సరికొత్త స్వరూపం ఇదే.. ఏ జిల్లాలో ఎన్ని మండలాలంటే..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల ఏర్పాటు (AP New Districts) కు సంబంధించిన ప్రక్రియ పూర్తైంది. ఈమేరకు ఉగాది పండుగ నాడు వర్చువల్ గా సమావేశమైన కేబినెట్ తుది నోటిఫికేషన్ కు ఆమోదం తెలిపింది.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాల ఏర్పాటు (AP New Districts) కు సంబంధించిన ప్రక్రియ పూర్తైంది. ఈమేరకు ఉగాది పండుగ నాడు వర్చువల్ గా సమావేశమైన కేబినెట్ తుది నోటిఫికేషన్ కు ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదం రావడంతో త్వరలోనే గెజిట్ విడుదలకానుంది. ప్రక్రియంతా పూర్తికావడంతో నోటిఫికేషన్ ఏ క్షణానైనా జారీ అయ్యే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లాల అవతరణకు ప్రభుత్వం మహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఉదయం 9:05 గంటల నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాల అవతరణ కార్యక్రమం జరగనుంది. కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్రంలో 26 జిల్లాలు, 73 రెవెన్యూ డివిజన్లతో గెజిట్ రెడీ అయింది. ఏపీలో 51 రెవెన్యూ డివిజన్లు ఉండగా.. కొత్తగా 22 డివిజన్లకు ఆమోదం తెలపడంతో ఆ సంఖ్య 73కి పెరిగింది.

    కొత్త జిల్లాల ప్రకారం రెవెన్యూ డివిజన్లును పరిశీలిస్తే.. శ్రీకాకుళం జిల్లాలో పలాస, టెక్కలి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, పాలకొండ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, రంపచోడవరం, విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం, కాకినాడ జిల్లాలో పెద్దాపురం, కాకినాడ, కోనసీమ (అమలాపురం) జిల్లాలో రామచంద్రాపురం, కొత్తపేట, అమలాపురం, తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, కొవ్వూరు పశ్చిమ గోదావరి జిల్లాలో నర్సాపురం, భీమవరం, ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం, నూజివీడు, ఏలూరు ఉన్నాయి.

    ఇది చదవండి: సీఎం జగన్ దంపతులను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు.. ఉగాది వేడుకల్లో అరుదైన దృశ్యం..


    ఇక కృష్ణా జిల్లాలో గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు, ఎన్టీఆర్ (విజయవాడ) జిల్లాలో నందిగామ, తిరువూరు, విజయవాడ, గుంటూరు జిల్లాలో తెనాలి, గుంటూరు, బాపట్ల జిల్లాలో చీరల, బాపట్ల, పల్నాడు జిల్లాలో నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, ప్రకాశం జిల్లాలో కనిగిరి, ఒంగోలు, మార్కాపురం, నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, కావలి, కందుకూరు, నెల్లూరు డివిజన్లు ఉన్నాయి.

    ఇది చదవండి: జగన్ తన టీమ్ రెడీ చేసుకుంటున్నారు... సజ్జల ఆసక్తికర కామెంట్స్..!



    రాయలసీమ విషయానికి వస్తే.., కర్నూలు జిల్లాలో పత్తికొండ, ఆదోని, కర్నూలు, నంద్యాల జిల్లాలో డోన్, నంద్యాల, ఆత్మకూరు, అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, గుంతకల్, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో కదిరి, పుట్టపర్తి, పెనుగొండ, ధర్మవరం, కడప జిల్లాలో జమ్మలమడుగు, కడప, బద్వేల్, అన్నమయ్య జిల్లాలో రాయచోటి, మదనపల్లె, రాజంపేట, చిత్తూరు జిల్లాలో కుప్పం, పలమనేరు, నగరి, చిత్తూరు, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి, తిరుపతి, గూడూరు, సూళ్లూరుపేట ఉన్నాయి.

    ఇది చదవండి: ఉగాది రోజు పవన్ సంచలన ప్రకటన.. కౌలు రైతుల కోసం రంగంలోకి జనసేనాని


    కొత్త జిల్లాల్లో మండలాల సంఖ్య పరంగా చూస్తే అత్యధికంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 38 మండలాలుండగా.. అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 11 మండలాలున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 30, విజయనగరం జిల్లాలో 27, పార్వతీపురం మన్యం జిల్లాలో 15, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 22, విశాఖపట్నం జిల్లాలో 11, అనకాపల్లి జిల్లాలో 24, కాకినాడ జిల్లాలో 21, కోనసీమ జిల్లాలో 22, తూర్పుగోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 19, ఏలూరు జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 25, ఎన్టీఆర్ జిల్లాలో 20, గుంటూరు జిల్లాలో 18, బాపట్ల జిల్లాలో 25, పల్నాడు జిల్లాలో 28, ప్రకాశం జిల్లాలో 38, నెల్లూరు జిల్లాలో 38, కర్నూలు జిల్లాలో 26, అనంతపురం జిల్లాలో 31, శ్రీసత్యసాయి జిల్లాలో 32, కడప జిల్లాలో 36, అన్నమయ్య జిల్లాలో 30, చిత్తూరు జిల్లాలో 31, తిరుపతి జిల్లాలో 34 మండలాలున్నాయి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP new districts

    తదుపరి వార్తలు