Home /News /andhra-pradesh /

AP BJP PRESIDENT SOMU VEERRAJU CLARIFY ON ALLIANCE WITH JANASENA UMG

AP Politics: ఏపీలో రసవత్తర రాజకీయం.. జనసేన పొత్తు ఆ పార్టీతోనే.. క్లారిటీ వచ్చేసింది..?

జనసేన పొత్తు ఏ పార్టీతో..?

జనసేన పొత్తు ఏ పార్టీతో..?

సార్వత్రిక ఎన్నికల (General Elections)కు రెండేళ్ల ముందుగానే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు (AP Politics) రసవత్తరంగా మారాయి. 151 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించిన వైఎస్సార్‌సీపీ (YSRCP) ఈసారి టార్గెట్ 175గా అడుగులు ముందుకు వేస్తుంటే.. ఎలాగైన అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ (TDP) విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చకుండా ఉండేందుకు ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India
    సార్వత్రిక ఎన్నికల (General Elections)కు రెండేళ్ల ముందుగానే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు (AP Politics) రసవత్తరంగా మారాయి. 151 స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించిన వైఎస్సార్‌సీపీ (YSRCP) ఈసారి టార్గెట్ 175గా అడుగులు ముందుకు వేస్తుంటే.. ఎలాగైన అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ (TDP) విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చకుండా ఉండేందుకు ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ సిద్ధంగా ఉంది. తాజాగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ కావడం ఆ పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.

    ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ ఇప్పుడు కాస్తంత కీలకంగా మారింది. కాపుల సపోర్ట్‌తో గోదావరి జిల్లాల్లో పట్టు సాధించాలని ఈసారి జనసేన గట్టిగా నిర్ణయించుకుంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా ఉండేందుకు కూడా ప్రయత్నిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే, టీడీపీతో పొత్తుపై మాత్రం ఇరు పార్టీల నాయకులు ఇప్పటివరకు పూర్తి క్లారిటీనే ఇచ్చింది లేదు. ఇరు పార్టీలు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా జగన్‌ను గద్దె దింపాలనే లక్ష్యంగానే పెట్టుకున్నాయి.

    ఇదీ చదవండి: సీఎం సొంత జిల్లాలో పవన్ కల్యాణ్.. 21న సిద్ధవటంలో సభ


    ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బీజేపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుందని, వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని వీర్రాజు స్పష్టం చేశారు. దీనిపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. కొద్దిరోజులుగా బీజేపీతో దూరంగా ఉంటూ వస్తున్న జనసేనాని, టీడీపీతో జత కలుస్తారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే, బీజేపీతో పొత్తు కొనసాగుతుందా లేదా అనేది మాత్రం జనసేన ఇంతవరకు స్పష్టం చేయలేదు. 2024 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో కీలకంగా మారాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్.. ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ప్రచారం ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జనసేన పొత్తు ఏ పార్టీతో ఉంటుందో అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.


    ఎన్టీఆర్ జిల్లాలో విలేకర్ల సమావేశం నిర్వహించిన సోము వీర్రాజు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే తమ పార్టీ కట్టుబడి ఉందని వీర్రాజు స్పష్టం చేశారు. అమరావతిని ఏపీ రాజధానిగా భావించి రాష్ట్రం నలుమూలల రహదారులను కేంద్ర ప్రభుత్వం నిర్మించిందని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం చేయలేని పాపం టీడీపీ, వైఎస్సార్‌సీపీలదేనంటూ విమర్శించారు. అమరావతి రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.
    Published by:Mahesh
    First published:

    Tags: AP Politics, Bjp-janasena, Pawan kalyan, Somu veerraju

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు