సీఎం జగన్‌కు అభినందనలు.. మేం ఊహించలేదన్న కన్నా

వైఎస్ జగన్, లక్ష్మీనారాయణ

గ్యాస్ లీకేజీ బాధితుల్లో పెద్దవాళ్లు కోలుకున్నారని... అయితే కొందరు పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.

  • Share this:
    వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన బాధితులకు, వారి కుటుంబాలకు సీఎం జగన్ ప్రకటించిన పరిహారంపై ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖలో గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... జగన్ ఈ స్థాయిలో పరిహారం ప్రకటిస్తారని తాము ఊహించలేదని వ్యాఖ్యానించారు. ఇది బాధితుల్లో మనోధైర్యం నింపేలా ఉందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బాధితుల్లో పెద్దవాళ్లు కోలుకున్నారని... అయితే కొందరు పిల్లల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు.

    అయితే ఈ ఘటన కారణంగా బాధితులపై భవిష్యత్తులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటాయనే ఆందోళన ఉందని... కాబట్టి వీరికి ఐదేళ్ల పాటు ప్రభుత్వం వైద్యపరంగా సాయం చేయాలని ఆయన సూచించారు. ఇది కచ్చితంగా మానవ తప్పిదమే అని వ్యాఖ్యానించిన కన్నా లక్ష్మీనారాయణ... ఈ ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: