తెలంగాణకు ఏపీ బీజేపీ ఎంపీ వార్నింగ్...

సంగమేశ్వరం వద్ద చేపట్టే లిఫ్ట్‌ను టచ్ చేస్తే తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయని ఏపీ బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ హెచ్చరించారు.

news18-telugu
Updated: May 14, 2020, 8:28 PM IST
తెలంగాణకు ఏపీ బీజేపీ ఎంపీ వార్నింగ్...
టీజీ వెంకటేష్(ఫైల్ ఫోటో)
  • Share this:
పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ సామర్థ్యం పెంపునకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 203పై తెలంగాణ, ఏపీ మధ్య వివాదం ముదురుతోంది. తెలంగాణకు చెందిన అధికార, విపక్షాలు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడుతుంటే... ఏపీలోని అధికార పార్టీ నేతలు మాత్రం ఈ అంశంలో సైలెంట్‌గా ఉంటున్నారు. అయితే తాజాగా ఈ అంశంపై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ తెలంగాణ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. శ్రీశైలం ప్రాజెక్టు తమ భూభాగంలోనే ఉందని ఎంపీ టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం తమ రైతులు 35 వేల ఎకరాలు త్యాగం చేశారని ఆయన గుర్తుచేశారు.

రాజ్యాంగం ప్రకారం కిందవాళ్ల అనుమతి తీసుకునే ఎగువన ప్రాజెక్టులు కట్టాలన్న టీజీ వెంకటేశ్... సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా ఎగువన ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని విమర్శించారు. సంగమేశ్వరం వద్ద చేపట్టే లిఫ్ట్‌ను టచ్ చేస్తే తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయని ఆయన హెచ్చరించారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నికర జలాలను కేసీఆర్ ఎప్పుడు అడిగారని టీజీ వెంకటేశ్ ప్రశ్నించారు. ఇలాగే మాట్లాడితే శ్రీశైలం ప్రాజెక్టు తమదేనని, గెట్ లాస్ట్ అనాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. గుండ్రేవుల, సిద్ధేశ్వరం ప్రాజెక్టులకు కూడా జగన్‌ జీవోలు ఇవ్వాలని టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: May 14, 2020, 8:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading