హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: వాలంటీర్ వ్యవస్థను తరిమికొట్టాలి.. జగన్ సర్కార్ పని అదేనన్న సోము..

AP Politics: వాలంటీర్ వ్యవస్థను తరిమికొట్టాలి.. జగన్ సర్కార్ పని అదేనన్న సోము..

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

సోము వీర్రాజు, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార ప్రతిపక్షాలపై బీజేపీ (BJP) విమర్శల దాడిని పెంచుతోంది. వీలు చిక్కినప్పుడల్లా ఆ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు (Somu Veerraju) రెండు పార్టీలను ఎండగడుతున్నారు. కేంద్ర నిధులు, రాజధాని నిర్మాణం, హైవేల నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో రెండు పార్టీలు స్టిక్కర్లతో ప్రజలను మోసం చేస్తున్నాయనే ప్రచారాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికార ప్రతిపక్షాలపై బీజేపీ (BJP) విమర్శల దాడిని పెంచుతోంది. వీలు చిక్కినప్పుడల్లా ఆ పార్టీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు (Somu Veerraju) రెండు పార్టీలను ఎండగడుతున్నారు. కేంద్ర నిధులు, రాజధాని నిర్మాణం, హైవేల నిర్మాణం, కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో రెండు పార్టీలు స్టిక్కర్లతో ప్రజలను మోసం చేస్తున్నాయనే ప్రచారాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. బుధవారం నెల్లూరులో జరిగిన శక్తి కేంద్ర ప్రముఖ్ ల సమావేశంలో పాల్గొన్న ఆయన.. జగన్ సర్కార్ తో పాటు గత ప్రభుత్వంపైనా మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై సోము ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ అప్పుల కోసం తిరగడమే రాష్ట్ర ప్రభుత్వం పని అని... కేంద్రం జాతీయ రహదారులు వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం క్రెడిట్ కోసం గొప్పలు చెప్పుకుంటోందన్నారు.

  నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక నిరంతర విద్యుత్ అందిస్తున్నామన్నారు. కేంద్రం విద్యుత్ సబ్ స్టేషన్లు ఇస్తే ఉద్యోగాలు మాత్రం తెలుగు దేశం ఆతర్వాత వైసీపీ ప్రభుత్వాలు లక్షల రూపాయలకు అమ్ముకున్నాయని సోము వీర్రాజు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటికీ స్టిక్కర్లు వేసి తమ ఘనతలుగా చెప్పుకుంటోందన్నారు.

  ఇది చదవండి: ఏపీ స్కూళ్లలో కొత్త కాన్సెప్ట్.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు..


  కేంద్ర ప్రభుత్వం రూ.3లక్షల కోట్లతో రోడ్లు, రూ.64వేల కోట్లతో రై ల్వే లైన్లు వేస్తోందని సోము వీర్రాజు పేర్కొన్నారు. పట్టణాల్లో మహిళా సంఘాలను మాజీ ప్రధాని వాజ్ పేయి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కేంద్ర జలజీవన్ మిషన్ కు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ నిధులు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటర్ల వ్యవస్థను బీజేపీ బూత్ కమిటీలు తరిమి కొట్టాలంటూ సోము వీర్రాజు పిలుపునిచ్చారు.

  ఇది చదవండి: ఏపీలో వేసవి కరెంటు కోతలు తప్పవా..? విద్యుత్ ఉత్పత్తిపై డేంజర్ బెల్స్..!


  హంద్రీ-నీవా ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.., రాయలసీమకు వ్యవసాయం నీరు అందించకపోవడంతో అక్కడ ప్రజలు వలస పోతున్నారని విమర్శించారు. ఇక ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ఆపడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని. మోదీ ఫోన్ చేస్తే రష్యా యుద్ధం ఆపిందని.. ప్రపంచంలోనే దమ్మున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని సోము అన్నారు.

  ఇది చదవండి: ఆంధ్రా హోటళ్లలో పూరీ, బజ్జీ బంద్.. కారణం ఇదే..!


  ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో వైసీపీ, టీడీపీల వైఫల్యాపై సోము వీర్రాజు తరచూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. రెండు పార్టీలతో స్నేహబంధం ఉండబోతోందన్న వార్తల నేపథ్యంలో అటు టీడీపీని, ఇటు వైసీపీపై విమర్శల జోరు పెంచుతున్నారు. ఇటీవల రాజధాని విషయంలోనూ ఆ రెండు పార్టీలను ఆయన టార్గెట్ చేశారు. రెండు ప్రాంతీయ పార్టీలు రాజధాని లేకుండా రాష్ట్ర ప్రజలను నడిరోడ్డుమీద నిలబెట్టారని ఆరోపించారు. ఈ విషయం రాజధాని రైతులు తెలుసుకోవాలని ఆయన సూచించారు.విభజన సమయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రస్తావించిన విషయాన్ని మర్చిపోకూడుదన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap bjp, Ap cm ys jagan mohan reddy, Somu veerraju

  ఉత్తమ కథలు