చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

Chiranjeevi: హీరో చిరంజీవిని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

news18-telugu
Updated: August 6, 2020, 8:58 PM IST
చిరంజీవిని కలిసిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
చిరంజీవి, సోము వీర్రాజు
  • Share this:
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు హీరో చిరంజీవిని కలిశారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోము వీర్రాజును చిరంజీవి అభినందించారు. ఆయనను పుష్పమాల, శాలువాతో సత్కరించారు. సోదరుడు పవన్‌ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చిరంజీవి సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఏపీలో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది.

ప్రజాసమస్యలపై జనసేన, బీజేపీ కలిసే పోరాటం చేస్తాయని పవన్ కళ్యాణ్ గతంలోనే ప్రకటించారు.
Published by: Kishore Akkaladevi
First published: August 6, 2020, 6:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading