AP BJP CHIEF SOMU VEERRAJU AND OTHERS ARRESTED BY POLICE AS THE STARTED TO GUDIVADA OVER CASINO ISSUE FULL DETAILS HERE PRN
BJP vs YCP: గుడివాడ ఫైటింగ్ లో బీజేపీ ఎంట్రీ.. సోము వీర్రాజు సహా నేతల అరెస్ట్..
బీజేపీ ఛలో గుడివాడ ఉద్రిక్తం
గుడివాడ క్యాసినో వివాదం (Gudivada Casino Issue) మరింత తీవ్రరూపం దాల్చుతోంది. నిన్నటి వరకు టీడీపీ (TDP), వైసీపీ (BJP) మధ్య జరిగిన యుద్ధంలో ఇప్పుడు బీజేపీ (BJP) ఎంటరైంది. మంగళవారం బీజేపీ నేతలు పిలుపునిచ్చిన చలో గుడివాడ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
గుడివాడ క్యాసినో వివాదం (Gudivada Casino Issue) మరింత తీవ్రరూపం దాల్చుతోంది. నిన్నటి వరకు టీడీపీ (TDP), వైసీపీ (BJP) మధ్య జరిగిన యుద్ధంలో ఇప్పుడు బీజేపీ (BJP) ఎంటరైంది. మంగళవారం బీజేపీ నేతలు పిలుపునిచ్చిన చలో గుడివాడ కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విజయవాడ నుంచి గుడివాడ వెళ్తున్న బీజేపీ నేతలను కలవపాముల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు నేతలను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా సోము వీర్రాజు రోడ్డుపైనే బైఠాయించడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సోముతో పాటు బీజేపీ నేతలను పోలీసులు తాళ్లతో అడ్డుకొని బలవంతంగా వ్యాన్ ఎక్కించి తీసుకెళ్లారు.
ప్రభుత్వ తీరుపై సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్రంలో 144 సెక్షన్ నడుస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని.. క్యాసినో గురించి ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని నిలదిశారు. సంక్రాంతి అంటే ఏంటో చూపిస్తామమంటూ.. గుడివాడలో సంక్రాంతి సంబరాల ముగింపు ఉత్సవాలకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దులు కావాలా.. లేక క్యాసినోలు కావాలా అని ప్రశ్నించారు. సంక్రాంతి సంబరాల పేరుతో బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా వైసీపీ ధ్వంసం చేసిందన్నారు. వివాదాలు సృష్టించడం తమ అభిమతం కాదని.. సాంప్రదాయాలను రక్షించడమే తమ లక్ష్యమని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
సోము వీర్రాజుతో పాటు బీజేపీ నేతలు సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి, రమేష్ నాయుడు, షేక్ బాజీ తదితరులను అడ్డుకున్నారు. ఐతే వాహనాలను అనుమతించకపోయినా వెళ్తామంటూ పాదయాత్రగా బయలుదేరే యత్నం చేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ముందుజాగ్రత్త చర్యలగానే అడ్డుకుంటున్నామని పోలీసులు చెప్పగా.. తాము నిరసనలకు వెళ్లడం లేదని సంక్రాంతి వేడుకలకే వెళ్తున్నామని ముందుకు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన బీజేపీ నేతలను ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సంక్రాంతి వేడుకలు నిర్వహించేందుకు వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమని సోము వీర్రాజు అన్నారు. తమ వేడుకలకు అనుమతి లేదంటున్నవారు.. పేకాటకు, క్యాసినోలకు, చీర్ గాళ్స్ కు ఎలా అనుమతులిచ్చారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని.. ప్రజలే వైసీపీకి బుద్ధి చెప్తారన్నారు.
సంక్రాంతి పండుగ మూడు రోజులు గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసింది. క్యాసినో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ వ్యవహారంపై గత పదిరోజులుగా రాజకీయాలు వేడెక్కాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.