AP BJP CHIEF MADE STRONG COMMENTS ON TDP AND YCP OVER PRESENT SITUATION IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
AP BJP: ఏపీకి ఈ గతిపట్టడానికి వాళ్లిద్దరే కారణం.. ప్రజలను రోడ్డుపై నిలబెట్టేశారు.. సోము వీర్రాజు ధ్వజం..
ప్రతీకాత్మకచిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఈ పరిస్థితులు రావడానికి వైసీపీ (TDP), టీడీపీ(TDP)లే కారణమని ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఈ పరిస్థితులు రావడానికి వైసీపీ (TDP), టీడీపీ(TDP)లే కారణమని ఏపీ బీజేపీ (BJP) అధ్యక్షుడు సోము వీర్రాజు (Somu Veerraju) విమర్శించారు. విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు ముక్కల్లాగా మూడు రాజధానులకు బేజీపీ వ్యతిరేకమని.., రెండు ప్రాంతీయ పార్టీలు రాజధాని లేకుండా రాష్ట్ర ప్రజలను నడిరోడ్డుమీద నిలబెట్టారని ఆరోపించారు. ఈ విషయం రాజధాని రైతులు తెలుసుకోవాలని ఆయన సూచించారు.విభజన సమయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రస్తావించిన విషయాన్ని మర్చిపోకూడుదన్నారు.
కేంద్రం ఎపీపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తుందని.., కేంద్రం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి, సంక్షేమ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు హయాంలో కేంద్రం రూ.30వేల కోట్ల ఉపాధి హామీ పధకం కింద నిధులు ఇచ్చిందని., వైసీపీ ప్రభుత్వం వచ్చాక కేవలం అర్బన్ ఇళ్ల కోసమే రూ.32వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. అంతేకాదు రాష్ట్రంలో నిర్మిస్తున్న జగనన్న ఇళ్లకు సంబంధించిన నిధులు కేంద్రానివేనని.., ఏ రాష్ట్రానికి ఈ స్థాయిలో నిధులు ఎక్కడా ఇవ్వలేదని సోము వీర్రాజు తెలిపారు.
అమరావతి రాజధాని గా కేంద్రం నిధులు కేటాయించిందని సోము వీర్రాజు గుర్తు చేశారు. టీడీపీ, వైసీపీ నాయకులు బీజేపీపై బురద జల్లాలని చూస్తున్నారన్న ఆయన.., ఈ రోజు రాష్ట్రంలో పరిణామాలకు గత, ప్రస్తుత ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. .గ్రామాల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులను జగన్ మళ్లించడాన్ని బీజేపీ ఖండిస్తోందన్నారు. గ్రామాల అభివృద్ధి పై జగన్ కు ఉన్న చిత్తశుద్ధి ఇదేనా అని ప్రశ్నించారు. పోర్ట్ ల అభివృద్ధి కి నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందని., రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమకే నిధులు ఇవ్వాలని కోరడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఇవ్వకపోగా., కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇష్టానుసారంగా వాడుతున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.
చంద్రబాబు హయాంలో పోలవరం నిర్మాణం లో అవినీతి జరిగిందని జగన్ ప్రచారం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక మీరెందుకు పోలవరం కడుతున్నారు. జగన్ కు చిత్తశుద్ధి ఉంటే ఇతర ప్రాజెక్టుల పనులు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. సచివాలయ సిబ్బందిని మూత్రశాలల వద్ద డ్యూటీ వేయడం ఏమిటని సోము వీర్రాజు ప్రశ్నించారు. ఉద్యోగులను దిగజార్చే ప్రభుత్వ చర్యలను అందరూ అర్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుంది పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అన్ ఛార్జ్ మురళీ దియోధర్, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.