news18-telugu
Updated: May 28, 2020, 8:10 PM IST
కన్నా లక్ష్మీనారాయణ(ఫైల్ ఫోటో)
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన చిన్న కుమారుడు ఫణేంద్ర భార్య సుహారిక అనుమానాస్పద రీతిలో చనిపోయారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లి సుహారిక కుప్పకూలారు. ఆమెను హుటాహుటిన రాయదుర్గంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఐతే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోడలు మృతితో కన్నా లక్ష్మీనారాయణ ఫ్యామిలీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఐతే ఆమె మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

కన్నా లక్ష్మి నారాయణ కుమారుడు, కోడలు
Published by:
Shiva Kumar Addula
First published:
May 28, 2020, 8:00 PM IST