హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అయోధ్య విషయంలో ఇలాగేనా?.. టీటీడీపై ఏపీ బీజేపీ తీవ్ర ఆగ్రహం..

అయోధ్య విషయంలో ఇలాగేనా?.. టీటీడీపై ఏపీ బీజేపీ తీవ్ర ఆగ్రహం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

TTD: 250 టీవీ ఛానళ్లు అయ్యోధ్య రామమందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారాన్ని గంటల పాటు ఇస్తే టీటీడీ ఎందుకు చేయలేదని ఏపీ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

    అయోధ్య రామమందిరం భూమిపూజను టీటీడీ ప్రసారం చేయకపోవడంపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌.విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్య ప్రసారాలను తిరుమల భక్తి ఛానల్‌లో ఎందుకు ప్రసారం చేయలేదని ప్రశ్నించారు. 250 టీవీ ఛానళ్లు అయ్యోధ్య రామమందిరం భూమి పూజ ప్రత్యక్ష ప్రసారాన్ని గంటల పాటు ఇస్తే టీటీడీ ఎందుకు చేయలేదని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి వెళ్లిన శారదాపీఠం విశాఖలో ప్రత్యక్ష ప్రసారాలు చేసే టీటీడీ అయోధ్య ప్రసారాలు ఎందుకు చేయలేదని మండిపడ్డారు. 24 గంటలలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి... తక్షణం స్పందించాలని రాష్ట్ర బీజేపీ డిమాండ్ చేస్తోందని విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Ap bjp, Ayodhya Ram Mandir, Svbc, Ttd

    ఉత్తమ కథలు