AP Assembly: మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశం ప్రారంభం.. వీటిపైనే ఫోకస్

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు 11 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుందని తెలుస్తోంది. వీటితోపాటు మరికొన్ని కొత్త చట్టాలు, చట్టసవరణలకు సంబంధించిన 30 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

news18-telugu
Updated: November 30, 2020, 8:41 AM IST
AP Assembly: మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశం ప్రారంభం.. వీటిపైనే ఫోకస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
మరికాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత అంచనా ప్రకారం ఈ సమావేశాలు డిసెంబర్‌ 4వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సభను కనీసం పది రోజులైనా జరపాలని టీడీపీ పట్టుబట్టనున్నట్టు సమాచారం. మరోవైపు సభలో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఉభయ సభల్లో ప్రారంభంలోనే తొలి అంశంగా సంతాప తీర్మానాలు ఉంటాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీ, ప్రఖ్యాత సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో పాటు పలువురు ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. శాసన మండలిలో కూడా ఈ ప్రముఖులతో పాటు మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాపం తెలిపే తీర్మానాలను ఆమోదిస్తారు. అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది.

ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఈ బిల్లులు ప్రవేశపెట్టాలి, వీటిపై చర్చించాలి అనే అంశాలను నిర్ణయిస్తారు. బీఏసీ సమావేశాల అనంతరం తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఇక తొలి రోజు 11 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుందని తెలుస్తోంది. వీటితోపాటు మరికొన్ని కొత్త చట్టాలు, చట్టసవరణలకు సంబంధించిన 30 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు పనులు, నాడు-నేడు పనితీరు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని అధికారపక్షం సభ ద్వారా ప్రజలకు వివరించనుంది.

మరోవైపు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకే వ్యూహరచన చేస్తున్న టీడీపీ.. పంట నష్టం, రైతుల సమస్యలపై ప్రతిపక్ష పార్టీ ఫోకస్ చేయనున్నట్లు సమాచారం. ఇక ప్రజలపై మోపుతోన్న పన్నలు భారం, టిడ్కో ఇళ్ల పంపిణీ అంశాలపై చర్చించాలని డిమాండ్ చేయనుందని తెలుస్తోంది. పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని గత కొంతకాలంగా ఆరోపిస్తున్న ప్రతిపక్ష పార్టీ…ఆయా అంశాలను సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు జరిగినన్నీ రోజులు
Published by: Kishore Akkaladevi
First published: November 30, 2020, 8:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading