TDP MLAs Suspended: ఏపీ అసెంబ్లీలో నాలుగో రోజు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

TDP MLAs Suspended: ఏపీ అసెంబ్లీలో నాలుగో రోజు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం(ఫైల్ ఫొటో)

నాలుగో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు పడింది. ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక రోజుపాటు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వరుసగా నాలుగో రోజు కూడా అదే సీన్ మళ్లీ కనిపించింది. నాలుగో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు పడింది. ఎనిమిది మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఒక రోజుపాటు సస్పెన్షన్ విధిస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడు, జోగేశ్వరరావు, రామకృష్ణబాబు, మంథని రామరాజు, అనగాని సత్యప్రసాద్, బాలవీరాంజనేయస్వామి, బెందాళం అశోక్ ను సభ నుంచి సస్పెండ్ అయ్యారు. సభలో స్పీకర్ పోడియం ఎక్కి సభ్యులు నిరసన తెలపడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఏపీలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో వైసీపీ అధికారంలోకి వస్తే 45 సంవత్సరాలు దాటిన మహిళలకు పెన్షన్లు ఇస్తామని జగన్ చెప్పారని, కానీ, అధికారంలోకి వచ్చాక వారిని మోసం చేశారని ఆరోపించారు. దీనిపై సీఎం జగన్ మండిపడ్డారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఒకసారి స్పష్టంగా చూడాలని చెప్పారు. రామానాయుడు డ్రామానాయుడులా మారారని, సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామానాయుడు మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ప్రతిపాదిస్తున్నట్టు చెప్పారు. సభను తప్పుదోవ పట్టించే రామానాయుడుకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వొద్దని స్పీకర్‌ను కోరారు.

    టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా నాలుగు రోజులు సస్పెన్షన్‌కు గురయ్యారు. మొదటి రోజు వరదల వల్ల రైతులు నష్టపోయారని, వారికి బీమా సొమ్ము అందించాలన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో వారిపై సస్పెన్షన్ వేటు పడింది. తాము ఇస్తున్నామని చెప్పినా కూడా సభను అడ్డుకుంటున్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఇక రెండో రోజు టిడ్కో ఇళ్లకు సంబంధించి సభలో గొడవ జరిగింది. టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లకు రంగులు మార్చి జగన్ తన పేరు వేసుకుంటున్నారంటూ టీడీపీ ఆరోపించింది. ఈ క్రమంలో సభలో వాగ్వాదం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు పడింది. మూడో రోజు పోలవరం, నాలుగో రోజు పెన్షన్ల అంశంపై సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: